భీమవరం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలపై అలసత్వం ప్రదర్శించరాదని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. సో మవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్ర జా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి పో లీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. 14 అర్జీలు అందగా ప్రధానంగా కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు, ఆస్తి తగాదాలు వంటి సివిల్ వివాదాలున్నాయి. డీఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
భీమవరం: జిల్లాలోని మూడు కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు సోమవారం జరిగినట్టు డీఈఓ ఈ.నారాయణ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్ పరీక్షకు 289 మందికి 256 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. భీమవరంలోని చినరంగనిపాలెం ఎంపీఎల్ హైస్కూల్‌లో పరీక్షా కేంద్రాన్ని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద తిరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఉన్నారు.
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో పోలీస్ సి బ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నా మని, సిబ్బంది కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అ న్నారు. ఏలూరు జిల్లా హోంగార్డు యూనిట్‌కు సంబంధించి తణుకులో హోంగార్డుగా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందగా సో మవారం ఆమె కుమార్తె ఎన్.శైలజకు హోంగార్డుగా ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే జిల్లా పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ జి.రాంబాబు భార్య విజయలక్ష్మికి అదనపు కార్పస్ ఫండ్‌లో రూ.లక్ష చెక్కును అందించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన రాయితీలను సకాలంలో అందించేలా ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, పోలీస్ అధికారులు ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాలో 56 కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ గణితం–1 పరీక్షకు 10,344 మంది వి ద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 8,417 మందికి గాను 8,259 మంది, 2,478 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2,085 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరి గాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు.
దూరవిద్య పరీక్షలకు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంగ్లిష్ పరీక్షలకు 575 మందికి 517 మంది విద్యార్థులు హాజయ్యారని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతి కోసం సా ధారణ సీనియార్జీ జాబితా రూపొందించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపా రు. జాబితాను డీఈఓ వెబ్‌సైట్, నోటీసు బో ర్డులో అందుబాటులో ఉంచామని, అభ్యంత రా లు ఉంటే ఈనెల 7లోపు తెలియజేయాలని సూచించారు. గడువు తర్వాత వచ్చిన వినతులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.


