చితికిపోతున్న బతుకులు.. కూలీలే సమిధలు | - | Sakshi
Sakshi News home page

చితికిపోతున్న బతుకులు.. కూలీలే సమిధలు

Mar 3 2026 7:16 AM | Updated on Mar 3 2026 7:16 AM

అనధికార కేంద్రాలపై నిఘా

ఏలూరు టౌన్‌: ప్రస్తుతం సీజన్‌తో సంబంధం లే కుండా నిరంతరం బాణసంచా తయారీ, విక్రయా లు సాగుతున్నాయి. జాతరలు, ఊరేగింపులు, శుభకార్యాలకు బాణసంచా కాల్చడం పరిపాటిగా మారింది. దీంతో ఆయా కేంద్రాల్లో మందుగుండు సామగ్రి విక్రయిస్తున్నారు. అయితే బాణసంచా వెలుగులు వెనుక కూలీల చీకటి బతుకులు దాగు న్నాయి. మందుగుండు తయారీలో కీలకమైన కూలీల ప్రాణాలకు గ్యారంటీ ఉండటం లేదు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా, కుటుంబ జీవనానికి ఆధారం కావడంతో పనిచేయక తప్పడం లేదు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన భారీ విస్ఫోటనం ఉ మ్మడి జిల్లావాసులను ఉలికిపాటుకు గురిచేసింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలను గుర్తుచేసుకుంటున్నా రు. ఏటా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో ప్ర మాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో కూలీల బతుకులే ఛిద్రమవుతున్నాయి. అక్రమ తయారీ, నిల్వలతో పాటు నిబంధనలు ఉల్లంఘించడం పలుచోట్ల ప్రమాదాలకు కారణమవుతోంది. వేట్లపాలెం ఘటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు.

జిల్లాలో అనధికారికంగా ఎవరైనా మందుగుండు సామగ్రి నిల్వలు ఉంచినా, తయారు చేసినా చర్యలు తప్పవు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విక్రయాలు చేపడితే ఉపేక్షించం. నిల్వ కేంద్రాల్లో విధిగా అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించాలి. ఇసుక బకెట్లు, తగినంత నీటి నిల్వలు ఉంచుకోవాలి. పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయకూడదు, స్టాక్‌ రిజిస్టర్‌ పక్కగా ఉంచుకోవాలి. ఇళ్ల మధ్యలో ఎవరైనా మందుగుండు నిల్వలు ఉంచితే కఠిన చర్యలు తప్పవు. – డి.శ్రావణ్‌కుమార్‌, ఏలూరు డీఎస్పీ

అగ్నికి ఆజ్యం

బలిగోరుతున్న బాణసంచా

అక్రమ తయారీ, నిల్వ కేంద్రాల్లో ప్రమాదాలు

నిబంధనల ఉల్లంఘనలతో పేలుళ్లు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement