కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత

Mar 3 2026 7:16 AM | Updated on Mar 3 2026 7:16 AM

కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత

భీమవరం (ప్రకాశంచౌక్‌): శబ్ధ, వాయు కాలుష్య నియంత్రణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో శబ్ధ, వాయు కాలుష్యం, ఏకీకృత కుటుంబ సర్వే, ఈకేవైసీ, ఈపీటీఎస్‌ ఫైల్స్‌ అప్‌లోడింగ్‌ త దితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. జా తరలు, ఆలయాలు, ఆస్పత్రుల వద్ద బాణసంచా కాల్చే విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీపావళి మినహా ఎక్కడా బాణసంచా కాల్చకూడదన్నారు. అనుమతులు లేకుండా ఎక్కడైనా బాణ సంచా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో బాణసంచా తయారీకి ఎవరికీ అనుమతులు లేవన్నారు. వేసవి దృష్ట్యా అగ్నిప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. లక్ష్యాల మేరకు ఏకీకృత సర్వే, ఈకేవైసీ పూర్తిచేయాలన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి హరిసూర్యప్రకాష్‌, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అక్షరాంధ్రపై.. జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 4న జరిగే ప్రీ ఫైనల్‌, 15న జరిగే ఫైనల్‌ పరీక్షలకు రిజిస్టర్‌ అయిన వారంతా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో వెబ్‌ఎక్స్‌ ద్వారా ఆమె మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement