గోశాలలు ఏర్పాటు చేయాలి
ఆగిరిపల్లి: ప్రభుత్వమే అన్ని దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని శ్రీశైలం శ్రీగిరి భువనేశ్వరి పీఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ అభినవ కళ్యాణానంద భారతి స్వామి డిమాండ్ చేశారు. శనివారం ఆగిరిపల్లిలోని శోభనగిరి క్షేత్రం వద్దనున్న గీతా శతాక్షి గో లోకధామం గోశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోశాలలోని ఆవుల పశుగ్రాసానికి ఐదు ఎకరాలు కేటాయించినందుకు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శోభనాచల క్షేత్రం స్వామికి వేల ఎకరాలు ఉన్న అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. స్వామివారి కొండపై ఎలాంటి అనుమతులు లేకుండా చర్చిలు ఏర్పాటు చేసి అన్యమత ప్రచారం చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం పదేపదే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని అనడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.


