శ్రీవారి క్షేత్రంలో భక్తుల కోలాహలం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి క్షేత్రంలో భక్తుల కోలాహలం

Mar 1 2026 7:19 AM | Updated on Mar 1 2026 7:19 AM

శ్రీవ

శ్రీవారి క్షేత్రంలో భక్తుల కోలాహలం

శ్రీవారి క్షేత్రంలో భక్తుల కోలాహలం సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం తైక్వాండో పోటీలకు ఎంపిక 3న ఆలయం మూసివేత చికిత్స పొందుతూ కార్మికుడి మృతి

ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆపదమొక్కుల వాడా.. వేంకటరమణ గోవిందా.. గోవింద అంటూ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాలు, టికెట్‌ విక్రయాల కౌంటర్లు, కల్యాణకట్ట, అనివేటి మండపం, ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం పోటెత్తాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.

ఏలూరు (టూటౌన్‌): ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకున్నవారు వచ్చే ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తిగా చెల్లిస్తే పూర్తి స్థాయిలో వడ్డీ మాఫీ చేస్తారని ఈడీ ఎం.ముక్కంటి తెలిపారు. స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో బకాయి చెల్లించిన లబ్ధిదారునికి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ అందజేసి సత్కరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 465 మంది లబ్ధిదారులు రూ.13.55 కోట్లు చెల్లించాల్సి ఉండగా వీరికి రూ.1.66 కోట్లు మాఫీ అవుతుందన్నారు.

ఆకివీడు: స్థానిక సమతానగర్‌కు చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన బోనాల రాము పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన సంఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై హెచ్‌.నాగరాజు చెప్పారు. గత ఏడాది ఆగస్టు నుంచి ప్రేమిస్తున్నానని వెంటబడి మోసగించాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఫిబ్రవరి 27న జేఎన్‌టీయు కాకినాడలో జరిగిన తైక్వాండో సెలక్షన్స్‌లో విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ విద్యార్థిని నగిరి నీతూ శ్రీసాయి విద్యార్థిని ఎంపికై ంది. మార్చ్‌ 16 నుంచి 20 వరకు ఒడిశాలో జరిగే సౌత్‌జోన్‌ పోటీలలో నీతూ పాల్గొంటున్నట్లు కళాశాల పీడీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా విజేతను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.వేణు తదితరులు అభినందించారు.

భీమవరం(ప్రకాశంచౌక్‌): ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటలకు మావుళ్లమ్మ ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. విశేష చండీహోమం ఆ రోజు ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి 9 గంటలు లోగా పూర్తి చేస్తామని తెలిపారు. బుధవారం అమ్మవారి ఆలయం ఉదయాన్నే తెరిచి శుద్ధిచేసి సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తారని మూల విరాట్‌ దర్శనం ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు.

పాలకొల్లు సెంట్రల్‌ : మండలంలోని పూలపల్లిలో ఓ రైస్‌మిల్లులో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ బ్లోయర్‌ మోటర్‌పై పడిన కార్మికుడు కట్టా రామ్మోహనరావు (51) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకారం మండలంలోని కాపవరం గ్రామానికి చెందిన రామ్మోహనరావు ఫిబ్రవరి 23న రైస్‌మిల్లులోని ఎలివేటర్‌లో ఉన్న ధాన్యం శుభ్రం చేస్తుండగా బ్లోయర్‌ మోటర్‌పై పడిపోయాడు. అతని ఎడమచేయి మణికట్టు వద్ద తెగి రక్తం కారడంతో పాటు వెన్నుపూస వద్ద బలమైన గాయమైంది. రామ్మోహనరావును హుటాహుటిన పట్టణంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కాకినాడకు తరలిస్తుండగా సీరియస్‌గా ఉండడంతో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీజె ప్రసాద్‌ తెలిపారు.

శ్రీవారి క్షేత్రంలో భక్తుల కోలాహలం 1
1/2

శ్రీవారి క్షేత్రంలో భక్తుల కోలాహలం

శ్రీవారి క్షేత్రంలో భక్తుల కోలాహలం 2
2/2

శ్రీవారి క్షేత్రంలో భక్తుల కోలాహలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement