ప్రైవేట్‌ ప్రవేషాలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ప్రవేషాలు

Feb 28 2026 1:27 PM | Updated on Feb 28 2026 1:27 PM

ప్రైవ

ప్రైవేట్‌ ప్రవేషాలు

ఇవి తప్పనిసరి

గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే చేర్పించాలి

మీ బాబు.. మా బాధ్యత.. ఏమీ చదవడం లేదా ఫర్వాలేదు.. టాప్‌లోకి తీసుకువెళ్తాం.. ఎల్‌కేజీ నుంచే ఐఐటీ స్టాండర్డ్స్‌.. మీ అబ్బాయి, లేదా అమ్మాయి పదో తరగతి పూర్తి చేశారా మా కళాశాలలో చేర్పించండి.. ఇప్పుడు చేరితే రూ.5 వేలు డిస్కౌంట్‌.. లేటయితే పూర్తిగా చెల్లించాలి.. లేదంటే స్కాలర్‌షిప్‌ టెస్టులో మార్కులు వస్తే ఫీజు తగ్గిస్తాం.. ఇవి తెల్లవారక ముందే విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటి ముందు ప్రత్యక్షమయ్యే కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల సిబ్బంది చెప్పే మాటలు.. అలాగే పదేపదే ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లతో ప్రైవేట్‌ పాఠశాలల అడ్మిషన్ల గోలతో విద్యార్థుల తల్లిదండ్రులు సతమతమవుతున్నారు.

పెనుగొండ: ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు, కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం వేట మొదలుపెట్టాయి. పరీక్షల కాలం మొదలవడం, విద్యా సంవత్సరం ముగియనుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ‘వల’ వేస్తున్నాయి. గ్రామస్థాయి లోని చిన్నపాటి స్కూళ్ల నుంచి పట్టణాల్లోని కార్పొరేట్‌ విద్యాసంస్థల వరకూ ఇదే అడ్మిషన్ల గోల. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 505 వరకూ ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఉన్నాయి. అనధికారికంగా వీటి సంఖ్య మరింత ఉంటుంది. ఏటా పుట్ట గొడుగుల్లా ప్రైవేట్‌ స్కూళ్లు పుట్టు కొస్తున్నాయి. దేశంలో పే రెన్నికగన్న విద్యాసంస్థల పేర్లుతో కలిసే విధంగా స్కూళ్లకు పేర్లు పెట్టి మరీ తల్లిదండ్రులను బురిడీ కొట్టించడానికి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

ప్రచారంతో బోల్తా కొట్టిస్తూ..

జిల్లాలో ప్రాథమిక పాఠశాలల రిజిస్ట్రేషన్లతో హైస్కూ ళ్లను నిర్వహిస్తున్న విద్యాసంస్థలు ఉన్నాయి. దీనిపై అవగాహన లేని తల్లిదండ్రులు వారి ప్రచారానికి బోల్తా పడుతూ రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా ప్రైవేట్‌ పాఠశాల ప్రా రంభించాలంటే ముందుగా ఓపెనింగ్‌ (ప్రారంభ) అనుమతి పొందాలి. అనంతరం విద్యార్థులను చే ర్చుకుని పూర్తిస్థాయి అనుమతులు పొందాలి. ప్రా థమిక స్థాయి పాఠశాలకు జిల్లా విద్యాశాఖాధికారి నుంచి, హైస్కూల్‌ కోసం విద్యాశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ ద్వారా విద్యా కమిషనర్‌ అనుమతులు తప్పనిసరి. అదే సీబీఎస్‌ఈ సిలబస్‌ కోసం కేంద్ర విద్యామండలి నుంచి అనుమతులు పొందాలి.

తల్లిదండ్రులూ అధ్యయనం చేయండి : తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాసంస్థల్లో చేర్పించే ముందు ఆ పాఠశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చే యాలి. అనుమతులు, విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలను, వాటిపై రిజిష్టర్డ్‌ అని ఉందో లేదో పరిశీలించాలి. అనుమతులు లేకుండా స్కూళ్లను నిర్వహిస్తూ, గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పరీక్షలు రాయించే విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని సంస్థలు బ్రాంచ్‌ల్లో విద్యార్థులను చేర్చుకుని మెయిన్‌ బ్రాంచ్‌ నుంచి పరీక్షలు రాయిస్తుంటాయి. అనుమతులు లేకపోతే చైల్డ్‌ ఇన్ఫో ఆధారంగా విడుదల చేసే ధ్రువీకరణ పత్రాలకు ఇబ్బందులు తప్పవు.

ప్రభుత్వ ఇంజనీరింగ్‌ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత, ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఉండాలి.

విద్యార్థుల మానసిక, శారీరక ఉల్లాసానికి క్రీడా ప్రాంగణం, క్రీడా ఉపాధ్యాయులు ఉండాలి.

ప్రాథమిక, ప్రాథమికోన్నత స్ఠాయిలో 20 నుంచి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరి.

హైస్కూళ్లలో సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున టీచర్‌ ఉండాలి.

సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణా శాఖ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, అనుభవజ్ఞుడైన డ్రైవర్‌ ఉండాలి.

భవనం పలు అంతస్తుల్లో ఉంటే అగ్నిమాపక పరికరాలు, మంటలు ఆర్పడానికి అవసరమైన సామగ్రి పూర్తిస్థాయిలో ఉండాలి.

కార్పొరేట్‌ వల

అడ్మిషన్ల కోసం ఇంటింటా ప్రచారం

ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లతో ఒత్తిడి

స్కాలర్‌షిప్‌ టెస్టులు.. డిస్కౌంట్‌ ఆఫర్లు

ప్రైవేట్‌ స్కూళ్ల సిబ్బంది హడావుడి

తల్లిదండ్రులూ.. తస్మాత్‌ జాగ్రత్త

ప్రచార ఆర్భాటాలకు మోసపోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు ఉన్న పాఠ శాలల్లో చేర్పించాలి. ప్రైవేట్‌ పాఠశాలలపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాం. గుర్తింపు లేని పాఠశాలల్లో అడ్మిషన్లు చేస్తే చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు చేర్పించే ముందు పాఠశాలకు గుర్తింపు, వాహనాల ఫిట్‌నెస్‌, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.

– డి.శుభాకరరావు, ఎంఈఓ, పెనుగొండ

ప్రైవేట్‌ ప్రవేషాలు1
1/2

ప్రైవేట్‌ ప్రవేషాలు

ప్రైవేట్‌ ప్రవేషాలు2
2/2

ప్రైవేట్‌ ప్రవేషాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement