కారుతో ఢీకొట్టి.. కత్తులతో వీరంగం
● రౌడీషీటర్ రౌతుల రఘుపై హత్యాయత్నం
● భీమవరంలో కోర్టు వాయిదాకు హాజరైన సమయంలో ఘటన
● పోలీసుల అదుపులో నిందితులు !
భీమవరం (ప్రకాశంచౌక్): పాత కక్షల నేపథ్యంలో రౌడీషీటర్ రౌతుల రఘుపై ప్రత్యర్థులు కారుతో ఢీ కొట్టి కత్తులతో వీరంగం సృష్టించి హత్యాయత్నం చేయడం భీమవరంలో కలకలం రేపింది. పట్టపగలు కోర్టు సమీపంలో జరిగిన ఈ ఘటనతో పట్ట ణం ఉలిక్కిపడింది. డీఎన్నార్ కళాశాల రోడ్డులోని కోర్టు సమీపంలో స్థానికులు భయాందోళన చెందా రు. వివరాలిలా ఉన్నాయి.. 2017లో రఘుపై నమోదైన పోలీసు కేసుకు సంబంధించి రఘు అతడి గ్రూప్ సభ్యులు, అనుచరులు శుక్రవారం కోర్టు వా యిదాకు హాజరై తిరిగి కారులో వెళుతున్న నేపథ్యంలో ప్రత్యర్థులు రఘు కారును మరొక కారుతో ఢీకొట్టి కత్తులతో హతమార్చేందుకు యత్నించారు. రఘు వెంటనే కారుదిగి అక్కడి నుంచి పరారై తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పోలీసులు వెంటనే స్పందించి రఘును గుర్తించి రక్షణగా నిలిచి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే మరో రౌడీషీటర్ గోవింద్, కొందరితో కలిసి రఘుపై హత్యాయత్నం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి టూటౌన్ సీఐ కాళీచరణ్ చేరుకుని హత్యాయత్నం జరిగిన కార్లను పరిశీలించి స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను వేగంగా పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పక్కా స్కెచ్‌తో
2022 డిసెంబర్ 24న రఘు సోదరుడు యేసుపై ప్ర త్యర్థులు భీమవరం బీసీ కాలనీలో అర్ధరాత్రి దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత కాలంలో గొల్లవానితిప్ప రోడ్డు సమీపంలోని క్రిమినల్ కోర్టుకు సమీపంలో పంట కాలువ రోడ్డుపై విజయ్ అనే యువకుడు హత్య గావించబడ్డాడు. హంతకులు మరణాయుధాలు, కత్తులతో ఆనాడు దాడి చేశారు. యే సును హత్య చేసిన ముఠాలోని విజయ్‌పై ప్రతీకారంగా అతడి సోదరుడు రఘు కొందరితో కలిసి ఆ హత్య చేసినట్టు టూటౌన్ పోలీసులు అప్పట్లో సు మారు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ నేప థ్యంలో ప్రత్యర్థులు రఘుపై ప్రతీకారం తీర్చుకోవడానికి పక్కా స్కెచ్‌తో దాడికి పాల్పడ్డారు. ముందుగా కారుతో రఘు కారును ఢీకొట్టి అనంతరం కత్తులతో హతమార్చాలని ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. రఘు తప్పించుకున్న తర్వాత ప్రత్య ర్థులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
కౌన్సెలింగ్ ఇచ్చినా మారని తీరు
టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ప్రతీకారమే ముఖ్యమన్నట్లు ఈ హత్యయత్నం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
కారుతో ఢీకొట్టి.. కత్తులతో వీరంగం
కారుతో ఢీకొట్టి.. కత్తులతో వీరంగం


