ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి

Feb 28 2026 1:27 PM | Updated on Feb 28 2026 1:27 PM

ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి

ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి

ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి నేడు పడవలు, వలల పంపిణీ ఈవెంట్‌ మేనేజర్‌ టోకరా ఉపాధ్యాయులపై నిర్లక్ష్య వైఖరి తగదు

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభు త్వాస్పత్రుల్లో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలను వీఆర్వో, వీఆర్‌ఏలు సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వాస్పత్రుల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో ఎం.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ రావి రాంబాబు పాల్గొన్నారు.

సహకార రంగంపై సమీక్ష

సహకార రంగాన్ని బలోపేతం చేసే దిశగా విస్తృత చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సహకార శాఖలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. అలాగే ఏకీకృత కుటుంబ సర్వే ప్రగతిపై గూగుల్‌ మీట్‌ ద్వారా మండలాల వారీగా సమీక్షించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): మోంథా తుపానుతో పడవలు, వలలు కోల్పోయిన జిల్లాలో మత్స్యకార కుటుంబాలకు ఊరట కలిగించేందుకు రామకృష్ణ మిషన్‌ నిధులతో తయారుచేసిన బోట్లను శనివారం పీఎం లంకలో జరిగే కార్యక్రమంలో అందించనున్నట్టు కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. 300 మంది మత్స్యకారులకు రూ.2.10 కోట్ల విలువైన పడవలు, వలలను పంపిణీ చేయను న్నామన్నారు. తొలిదశలో 100 మంది లబ్ధిదారులకు సుమారు రూ.70 లక్షల విలువైన సా మగ్రిని అందించనున్నట్టు చెప్పారు.

ఆహార తనిఖీలు చేపట్టాలి

కల్తీకి కారణమైన ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా ఆహార భద్రత తనిఖీ అధికారి, పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశమై రెండు రోజులుగా నిర్వహిస్తున్న సోదాలపై సమీక్షించారు. అనంతరం జిల్లా ఆహార భద్రత తనిఖీ అధికారి ఎ.సుందర్‌ రామిరెడ్డి భీమవరంలో పాల కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. శ్రీనివాస సెంటర్‌, డీఎన్‌ఆర్‌ కాలేజ్‌ రోడ్డులో కేంద్రాలను సోదాచేసి పాలు కల్తీ జరిగినట్టు గుర్తించి ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్‌ రిపోర్ట్‌ ఆధారంగా వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

దేహశుద్ధి చేసిన పెళ్లి జనం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రంలో ని పలు లాడ్జీల యజమానులకు ఓ ఈవెంట్‌ మేనేజర్‌ షాకిచ్చాడు. 40 రూములు బుక్‌ చేసి అడ్వాన్స్‌ ఇచ్చిన ఈవెంట్‌ మేనేజర్‌, వివాహమైన తర్వాత అద్దె డబ్బులు ఇవ్వలేనని చేతులెత్తేశాడు. అలాగే సౌకర్యాలు సక్రమంగా కల్పించని కారణంగా పెళ్లివారి చేతిలో దెబ్బలు తి న్నాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన వారు గురువారం రాత్రి క్షేత్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లను వరంగల్‌కు చెందిన ఓ ఈవెంట్‌ మే నేజర్‌కు అప్పగించి రూ.14.50 లక్షలు ఇ చ్చారు. ఇదిలా ఉంటే ఆ ఈవెంట్‌ మేనేజర్‌ ద్వారకాతిరుమలలోని దాదాపు 7 ప్రైవేట్‌ లాడ్జీల్లో 40 రూములు, కొన్ని గెస్ట్‌హౌస్‌లను మూడు రోజులపాటు అద్దెకు తీసుకున్నాడు. అందరికీ కొంత అడ్వాన్స్‌ ఇచ్చి, వివాహమైన తర్వాత మిగిలిన సొమ్ము ఇస్తానన్నాడు. అయితే వివాహమైన తర్వాత తన వద్ద డబ్బులు లేవని చేతులెత్తేశాడు. దీంతో లాడ్జీల యజమానులు ఈవెంట్‌ మేనేజర్‌ వచ్చిన కారును స్వాధీనం చేసుకోవాలని భావించారు. అయితే అది ట్రా వెల్స్‌ కారు అని తెలిసి ఖంగుతిన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దామనుకున్న సమ యంలో ఈవెంట్‌ మేనేజర్‌ కాళ్ల బేరానికి వచ్చి ప్రామిసరీ నోట్లు రాసిచ్చి, అక్కడి నుంచి జా రుకున్నాడు. పెళ్లి జనాల కోసం ఏర్పాటు చేసి న ట్రావెల్స్‌ బస్సులకు కూడా అద్దె చెల్లించకపోవడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో ఆగ్రహించిన పెళ్లివారు సదరు ఈవెంట్‌ మేనేజర్‌ను స్థానిక సొసైటీ పెట్రోల్‌ బంకు వద్ద చితకబాదారు. ఒక్క గెస్ట్‌ హౌస్‌లకే రూ.70 వేల వరకు చెల్లించాలని తెలిసింది. దీ నిని బట్టి అతడు ఎగవేసిన అద్దె సొమ్ము రూ.లక్షల్లో ఉంటుందని అంటున్నారు.

చింతలపూడి: ఉపాధ్యాయులపై నిర్లక్ష్య వైఖరి వీడాలని, తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గళమెత్తారు. శుక్రవారం స్థానిక ఽఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ 12వ పీఆర్సీని తక్షణమే నియమించాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌ బకాయిలు వి డుదల చేయాలని, పనిభారం తగ్గించాలని, ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నిబంధనను రద్దు చేయాలని కోరారు. అనంతరం ప్రమద్వరకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement