నేత్రపర్వం ఏకాదశి ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం ఏకాదశి ఉత్సవం

Feb 28 2026 1:26 PM | Updated on Feb 28 2026 1:26 PM

నేత్రపర్వం ఏకాదశి ఉత్సవం

నేత్రపర్వం ఏకాదశి ఉత్సవం

నేత్రపర్వం ఏకాదశి ఉత్సవం

ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement