తాడేపల్లిగూడెం రూరల్: గ్రామ స్థాయిలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ వడ్డి రఘురాం నాయుడు అన్నారు. బుధవారం మండలంలోని పట్టెంపాలెంలో జనసేనకు చెందిన వంద మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వడ్డి రఘురాం పార్టీ కండువాలు వేసి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలన్నారు. ఎంపీటీసీ జంపెల్లి సత్యవతి, సర్పంచ్ ఎలిపే గాంధీ, నాయకులు గొర్రెల శ్రీనివాస్, గంటి చిన సర్వేశ్వరరావు, సూర్పరాజు పాల్గొన్నారు.


