గూడెంలో చెరవులు | - | Sakshi
Sakshi News home page

గూడెంలో చెరవులు

Feb 27 2026 7:50 AM | Updated on Feb 27 2026 7:50 AM

గూడెం

గూడెంలో చెరవులు

చాలా చెరువులు పూడ్చేశారు

ఆక్రమణలు.. అస్తవ్యస్తం

తాడేపల్లిగూడెం (టీఓసీ): తాగునీటి వనరులను అందించడంతో పాటు భూగర్భ జలాల పరిరక్షణలో ప్రధాన భూమిక పోషించే చెరువులు ఆక్రమణల చెరలో చిక్కుకుని కుచించుకుపోతున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు చెరువులు కబ్జాలకు గురయ్యాయి. పట్టణంలో సుమారు 30 వరకు పెద్ద, చిన్న చెరువులు ఉండేవని పెద్దలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా వరకూ చెరువులు కనుమరుగయ్యాయి.

కుళాయిలు లేని రోజుల్లో..

పట్టణంలోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు కుళాయిలు లేని రోజుల్లో వన్‌టౌన్‌, టూటౌన్‌లోని పలు ప్రాంతాల్లో చెరువులు తవ్వించారు. అనంతర కా లంలో పాతూరు శివారులో పంపుల చెరువు రావడంతో ఇంటింటికీ కుళాయిలు వచ్చాయి. దీంతో పలు చెరువులు నిరుపయోగంగా మారాయి. కాలక్రమేణా అవి నిర్లక్ష్యానికి గురై గుర్రపుడెక్క, తూ డుతో నిండిపోయాయి. అనంతరం ఆక్రమణలకు గురయ్యాయి. అలాగే పట్టణంలో కొందరు లబ్ధి కోసం కొన్ని చెరువులను ఆలయాలుగా మార్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

వన్‌టౌన్‌, టూటౌన్‌ ప్రాంతాల్లో..

పట్టణంలోని వన్‌టౌన్‌ పాతూరు ప్రాంతంలో తాడేపల్లిచెరువు, సంజీవనగర్‌ ఉన్నత పాఠశాల ఎదు రుగా చెరువు, మున్సిపల్‌ కార్యాలయం వద్ద అనంతమ్మ చెరువు, టీటీడీ కల్యాణ మండపం నుంచి మామిడితోట ఏరియాలో రెండు చెరువులు, గొల్లగూడెం చెరువు, సుబ్బారావుపేటలో డీఎస్‌ చెరువు, కొండాలమ్మ చెరువు, మామిడాల చెరువు, వానపల్లిగూడెం చెరువు, వీకర్స్‌ కాలనీలో పసర్లు చెరువు, కడకట్ల తోట సమీపంలో చెరువు, కడకట్లలో పలు చెరువులు, కొండయ్య చెరువు, గోగులమ్మ గుడి వద్ద చెరువు, హౌసింగ్‌ బోర్డు వద్ద చెరువు ఉండేవి. అలాగే టూటౌన్‌ ప్రాంతంలో జువ్వలపాలెంలో మూడు చెరువులు, పెద్ద శివాలయం సమీపంలో కృష్ణుడు చెరువు, భాగ్యలక్ష్మిపేటలోని ఆంజనేయస్వామి గుడి చెరువు, రామచంద్రరావు పేటలోని కృష్ణుడు చెరువు, యాగర్లపల్లి సమీపంలో చెరువులు, ముదునూరుపాడు బాల వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చెరువు, అక్కడే మరికొన్ని చెరువులు, కేఎన్‌ రోడ్డుకు పక్కగా స్కూల్‌ వద్ద చెరువులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కొన్ని కనుమరుగయ్యాయి.

పరిరక్షణ ఊసేది?

పట్టణంలో చెరువుల రూపురేఖలు మారిపోతున్నా వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. చెరువుల వద్ద ఆక్రమణలను తొలగించాలని, చెరువుల్లో చేరిన వ్యర్థాలను తొలగించి, చెరువు గట్లను పెంచి, ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే చెరువుల వద్ద వాకింగ్‌ ట్రాక్‌, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని అంటున్నా రు. చెరువుల వద్ద మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయవచ్చని పలు వురు చెబుతున్నారు.

పట్టణంలో చెరువులు క్రమక్రమంగా కన్పించడం లేదు. ఇప్పటికే పలు చెరువులను పూర్తిగా పూడ్చివేశారు. రూపురేఖలు కూడా లేకుండా చేశారు. కనీసం ప్రస్తుతం ఉన్న చెరువులను అయినా అభివృద్ధి చేయాలి. అహ్లాదకరంగా మార్చడంతో పాటు బోటు క్లబ్‌లుగా రూపొందించాలి. అందరికీ ఉపయోగపడేలా చూడాలి.

– ఎస్‌ఎం సుభానీ, తాడేపల్లిగూడెం

దర్జాగా కబ్జా

ఆక్రమణల్లో చెరువులు

కొనసాగుతున్న పూడ్చివేత

అపరిశుభ్రంగా మరికొన్ని..

చెరువుల ప్రక్షాళన ఊసెత్తని ప్రభుత్వం

పట్టణంలో 30 చెరువులు వరకు ఉండగా చాలా చెరువులు కనుమరుగయ్యాయి. కొన్ని చెరువుల గట్టుల వద్ద గుడి నిర్మాణాలు చేపట్టారు. కొన్ని చెరువులను ఖాళీ స్థలాలుగా మార్చేశారు. మరికొన్ని చెరువులు వర్షం నీరు, డ్రెయినేజీ వ్యర్థాలతో మురుగుకూపాలుగా మారాయి. సుబ్బారావుపేటలోని డీఎస్‌ చెరువు తూడుతో అస్తవ్యస్తంగా మారింది. వీకర్స్‌కాలనీ పసర్లు చెరువు ఆక్రమణల బారిన పడింది. పాతూరు చెరువు డ్రెయినేజీ వ్యర్థాలతో నిండిపోయింది. కడకట్లలో కొండయ్య చెరువును అభివృద్ధి చేస్తామని గతంలో ప్రకటించినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. పెద్ద శివాలయం వద్ద కృష్ణుడు చెరువు ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం ఆ చెరువులోకి మురుగు నీరు చేరుతోంది. రైల్వే ట్రాక్‌ దగ్గరలో ఉండటం, ఆక్రమణలతో కనీసం చెరువును గుర్తించే పరిస్థితి కూడా లేదు.

గూడెంలో చెరవులు 1
1/3

గూడెంలో చెరవులు

గూడెంలో చెరవులు 2
2/3

గూడెంలో చెరవులు

గూడెంలో చెరవులు 3
3/3

గూడెంలో చెరవులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement