ఆహార పదార్థాల కల్తీని ఉపేక్షించం | - | Sakshi
Sakshi News home page

ఆహార పదార్థాల కల్తీని ఉపేక్షించం

Feb 27 2026 7:50 AM | Updated on Feb 27 2026 7:50 AM

ఆహార పదార్థాల కల్తీని ఉపేక్షించం

ఆహార పదార్థాల కల్తీని ఉపేక్షించం

ఆహార పదార్థాల కల్తీని ఉపేక్షించం

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి హెచ్చరించారు. రెండు రోజులుగా కల్తీ పాలు, నెయ్యిలపై వస్తున్న వార్తల దృష్ట్యా జిల్లా విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లావ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్లు,సిబ్బంది, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భీమవరంలో మున్సిపల్‌ కమిషనర్‌, ఆహార భద్రత అధికారులు పాలు, నెయ్యి దుకాణాలను తనిఖీ చేశారు. పోలీస్‌ బొమ్మ సెంటర్‌లోని రిలయన్స్‌ షాపింగ్‌ మాల్‌ పక్క సందులోని నెయ్యి షాపులో నెయ్యి కల్తీ జరిగినట్టు భావించి వెన్న, నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన వెన్నను సీజ్‌ చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా మున్సిపల్‌ ట్రేడ్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ పొందాలని కలెక్టర్‌ ఆదేశించారు. సోదాల్లో పట్టుబడిన వెన్నను పో లి ఉన్న పదార్థం మూటలను మున్సిపల్‌ కార్యాలయానికి తరలించగా కలెక్టర్‌ పరిశీలించారు. మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్‌ కె.రామచంద్ర రెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎ.రాంబాబు, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి సుందర రామిరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement