సొంత గూటికి ఎంపీటీసీ సత్యవతి
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని వీరంపాలెం, పట్టెంపాలెం గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు జంపెల్లి సత్యవతి గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పట్టెంపాలెంలో పెనుమత్స సూర్పరాజు నివాసంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వడ్డి రఘురాం ఆమెతో పాటు కుమారుడు అశోక్‌కు పార్టీ కండువా వేసి, స్వాగతించారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన సత్యవతి గతంలో జనసేనలో చేరారు. అయితే, తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సత్యవతి మాట్లాడుతూ పార్టీపై ఉన్న విశ్వాసం, రఘురాం నాయకత్వంపై నమ్మకంతో తిరిగి పార్టీలోకి వచ్చినట్లు వివరించారు. పార్టీకి విధేయురాలిగా ఉంటూ ప్రజల సమస్యలు, గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేయడానికి కృషి చేస్తానన్నారు. ఆయా గ్రామాల పార్టీ కార్యకర్తలు మాకరాజు సతీష్, గంటి చిన సర్వేశ్వరరావు, పెనుమత్స సూర్పరాజు, ముప్పిడి రమేష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అడపా వాసు తదితరులు పాల్గొన్నారు.
వడ్డి రఘురాం ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరిక


