న్యూస్‌రీల్
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షి, భీమవరం: జిల్లాలో ఆయా(హెల్పర్లు)లతో నడిచే మినీ కేంద్రాలు 70, వర్కర్, హెల్పర్లతో నిర్వహించే కేంద్రాలు 1,556 ఉన్నాయి. వీటి పరిధిలో 7,936 మంది గర్భవతులు, 5,686 మంది బాలింతలు, ఏడు నెలల వయస్సు నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 40,706 మంది, మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు బాలలు 17,687 మంది ఉన్నారు. వీరికి జిల్లా వ్యాప్తంగా 3,050 మంది వరకు అంగనన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ద్వారా అవసరమైన సేవలందిస్తున్నారు.
హామీ ఇచ్చి.. వంచించి
2024 ఎన్నికల ముందు వేతనాల పెంపు కోసం ఉద్యమించిన అంగనన్‌వాడీలను చంద్రబాబు కలిసి మద్దతు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రాట్యుటీ పెంపుపై సుప్రీంకోర్టు తీర్పు అమలుచేస్తామని, కనీస వేతనం పెంచుతామన్నారు. అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతున్నా ఎన్నికల హామీకి అతీగతీ లేదు. ఎన్నికల హామీ అమలు కోరుతూ ఇప్పటికే పలుమార్లు శాంతియుతంగా నిరసన తెలుపుతూ వచ్చారు. తాజాగా రాష్ట్ర సంఘం ఇచ్చిన చలో విజయవాడ పిలుపుతో జిల్లా నుంచి అధిక సంఖ్యలో అంగనన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు తరలివెళ్లారు. మంగళవారం తెల్లవారుజాము సమయంలో పోలీసులు శిబిరాన్ని నిర్బంధించి అక్రమ అరెస్టులు చేసి మారుమూల స్టేషన్లకు తరలించడంతో వీరు తీవ్ర అగచాట్లు పడాల్సి వచ్చింది. ప్రభుత్వ వంచనపై సీఐటీయూ, అనుబంధ సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలన్న కనీస కనికరం లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించారంటూ జిల్లాలోని ఆయా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల హామీలు అమలుచేసేంత వరకు ఉద్యమాన్ని అపేదిలేదని స్పష్టం చేస్తున్నారు.
అంగన్‌్‌వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ చెల్లిస్తాం
ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి హామీ
అంగన్‌వాడీలకు సుప్రీం తీర్పు అమలుచేస్తామన్న చంద్రబాబు
గ్రాట్యూటీ, కనీస వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ
రెండేళ్లవుతున్నా అతీగతీ లేని వైనం
అక్రమ అరెస్టులతో ఉద్యమం అణచివేసే కుట్ర
జిల్లాలో 3182 మంది అంగన్‌వాడీ ఆయాలు, కార్యకర్తలు
అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రాట్యూటీ చెల్లిస్తాం, కనీస వేతనం పెంచుతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు ఎన్నికల్లో ఊదరగొట్టారు. మరో రెండు నెలల్లో కూటమి రెండేళ్ల పాలన పూర్తవనుండగా ఎన్నికల హామీ అమలు కోరిన అంగన్‌వాడీలను చర్చల పేరిట పిలిచి అక్రమ అరెస్టులు చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


