డయాలసిస్‌తో సతమతం | - | Sakshi
Sakshi News home page

డయాలసిస్‌తో సతమతం

Feb 27 2026 4:05 AM | Updated on Feb 27 2026 4:05 AM

డయాలస

డయాలసిస్‌తో సతమతం

డయాలసిస్‌తో సతమతం

కల్తీని అరికట్టాలి

ప్రభుత్వమే పూర్తి వైద్యం అందజేయాలి

మూడేళ్ల నుంచి డయాలసిస్‌ చేయించుకుంటున్నా

జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ వ్యాఽధిగ్రస్తులు

చాలీచాలని డయాలసిస్‌ సెంటర్లు

ఆకివీడు: మారిన జీవన శైలి, పాలు, నీళ్లు, ఆహార పదార్థాల్లో కల్లీ కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. వారు నిరంతరం డయాలసిస్‌ చేయించుకుంటూ జీవనం గడపాల్సిన పరిస్థితి. డయాలసిస్‌ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఇటు ఆరోగ్యంతోపాటు అటు ఆర్థిక ఇబ్బందులతో రోగుల కుటుంబాలు సతమతవుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రభుత్వ డయాలసిస్‌ సెంటర్లు

మూత్రపిండాలు సక్రమంగా పనిచేయనప్పుడు రక్తం నుంచి అదనపు ద్రవాలు, మలినాలు తొలగించేందుకు కృత్రిమంగా రక్తశుద్ధి చేసే ప్రకియే డయాలసిస్‌. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వ్యాధిగ్రస్తులు సుమారు 2 వేల మంది ఉంటే కేవలం ఏడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే డయాలసిస్‌ కేంద్రాలున్నాయి. ఏలూరు, కొవ్వలి, బుట్టాయిగూడెంతో పాటు ఆకివీడు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు ఏరియా ఆసుపత్రిలతో పాటు ప్రైవేటుగా మరో మూడు, నాలుగు డయాలసిస్‌ కేంద్రాలున్నాయి. వీటిలో సుమారుగా 60 డయాలసిస్‌ మిషన్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 40కి పైగా ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ, గుంటూరు, అమరావతి, రాజమండ్రి, వైజాగ్‌ తదితర పెద్ద పట్టణాలకు వెళ్లి డయాలసిస్‌లు చేయించుకుంటున్నారు. కిడ్నీ మార్పిళ్లు కూడా చేయించుకుంటున్నారు.

భయపెడుతున్న రాజమండ్రి కిడ్నీ కల్లోలం

గత నాలుగు రోజులుగా రాజమండ్రిలో కిడ్నీ బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయిన ఘటనలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కల్తీ ఆహారం, పాలు, నీళ్లు, వాయు కాలుష్యాలతో ప్రజలు సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కిడ్నీ వ్యాఽధిగ్రస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. పాలు, నీళ్లు వాయు కాలుష్యంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తనిఖీలు లేవు. డయాలసిస్‌ రోగులకు పూర్తి వైద్యం, మందులు ఉచితంగా అందజేయాలి. కిడ్నీ వ్యాధికి కారణాల్ని అన్వేషించి, నివారణ చర్యలు చేపట్టాలి. ఇటీవల రాజమండ్రిలో పాల కల్తీతో నలుగురు చనిపోయినా ప్రభుత్వం చలించలేదు.

– బీ.బలరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

వర్గ సభ్యులు, భీమవరం

కిడ్నీ వ్యాఽధిగ్రస్తులకు ప్రభుత్వమే పూర్తి ఉచిత వైద్యం అందజేయాలి. ఆరోగ్య శ్రీ ద్వారా కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. డయాలసిస్‌ రోగుల కుటుంబ పోషణకు ఆర్థికంగా సహాయం అందజేయాలి. ప్రభుత్వం ఫించన్‌ను రూ.20 వేలకు పెంచాలి. ఆహారాల్లో కల్తీ అరికట్టాలి. కల్తీపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలి.

– పీవీఎల్‌ నర్శింహరాజు, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఉండి

నా పేరు కింజరాపు శంకర్‌రావు. నా వయస్సు 36 సంవత్సరాలు. నాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండు కిడ్నీలూ పాడైపోయాయన్నారు. ఒకటి మార్చాల్సి ఉందని, అప్పటి వరకూ డయాలసిస్‌ చేయించుకోమన్నారు. మూడేళ్లుగా డయాలసిస్‌ చేయించుకుంటూనే ఉన్నాను. నా భార్యకు వచ్చే జీతంలో కొంత ఖర్చుచేస్తూ మందులు, ఫిల్టర్లు, బ్లడ్‌ కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వం రూ. 10వేలు పింఛన్‌ ఇస్తుంది. భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. ప్రయాణఖర్చులు, ఇతర ఖర్చులతో నెలకు రూ.20 వేల నుంచి 30 వేల వరకూ ఖర్చు అవుతుంది. తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బంబదులతో జీవనం గడుపుతున్నాను. కిడ్నీ రోగులకు ప్రభుత్వం రూ.20 వేలు ఫించన్‌ మంజూరు చేయాలి. అన్ని మందులు, డయాలసిస్‌ ఉచితంగా చేయించాలి.

డయాలసిస్‌తో సతమతం 1
1/3

డయాలసిస్‌తో సతమతం

డయాలసిస్‌తో సతమతం 2
2/3

డయాలసిస్‌తో సతమతం

డయాలసిస్‌తో సతమతం 3
3/3

డయాలసిస్‌తో సతమతం

Advertisement
 
Advertisement
Advertisement