ఇరగవరం వైస్ ఎంపీపీగా మంగెన
పట్టు నిలుపుకున్న వైఎస్సార్‌సీపీ
ఇరగవరం: ఇరగవరం మండల వైస్ ఎంపీపీ పదవికి గురువారం ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్‌సీపీ ఇరగవరం ఎంపీటీసీ–2 మంగెన వెంకట రామానాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘ ఆదేశాలతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ప్రిసైడింగ్ అధికారి, తాడేపల్లిగూడెం డివిజనల్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన ఇరగవరం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు. ప్రత్యేక సమావేశానికి 19 ఎంపీటీసీ సభ్యులకు 15 మంది హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వెంకట రామానాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన ప్రమాణ స్వీకా రం చేశారు. ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగ తాయారు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యుడు పంపన అంజిబాబు, కో–ఆప్షన్ సభ్యులు షేక్ మాబ్ తదితరులు పాల్గొన్నారు.


