ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఇద్దరిపై కేసు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఇద్దరిపై కేసు

Mar 2 2026 7:15 AM | Updated on Mar 2 2026 7:15 AM

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఇద్దరిపై కేసు

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఇద్దరిపై కేసు

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఇద్దరిపై కేసు ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

భీమడోలు: డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసగించిన ఇద్దరిపై భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎంపురంకు చెందిన వానపల్లి వినయ్‌కుమార్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చస్త్రశారు. వైజాగ్‌కు చెందిన యాండ్ర లక్ష్మీ, ఆమె కుమారుడు విక్కీ పరిచయమయ్యారు. లావోస్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి గతేడాది మేలో రూ.2.20 లక్షలు తీసుకున్నారు. వినయ్‌ను లావోస్‌కు పంపి వదిలేశారు. అక్కడ ఉద్యోగం లేకపోవడంతో వినయ్‌కుమార్‌ నానా అవస్థలు పడ్డాడు. ఇటీవల అతికష్టంపై ఇంటికి చేరుకున్న వినయ్‌ తల్లీ కొడుకులపై భీమడోలు పోలీస్‌స్టేషన్‌ కేసు పెట్టాడు. ఎస్సై ఎస్‌కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కై కలూరు: ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం పెంచికలమర్రుకు చెందిన జయమంగళ దావీదు(33) శనివారం రోడ్డు దాటుతుండగా కొల్లేటికోట నుంచి వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement