పది పరీక్షలకు అంతా సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షలకు అంతా సిద్ధం

Mar 6 2026 8:00 AM | Updated on Mar 6 2026 8:00 AM

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పరీక్షల టైమ్‌ టేబుల్‌ ఇలా..

భీమవరం: జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అంతా సిద్ధమైంది. ఈనెల 16వ తేదీన ప్రారంభం కానున్ను పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 132 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో మొత్తం 24,166 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. టెన్త్‌ పరీక్షల్లో గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 81 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో 88 శాతం ఉత్తీర్ణత సాఽధించాలనే లక్ష్యంగా విద్యాశాఖ నిర్ణయించుకోంది.

బాలురే అధికం : పబ్లిక్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో బాలికల కంటే బాలురే అధికంగా ఉన్నారు. మొత్తం 24,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా వారిలో 12,270 మంది బాలురు, 11,406 మంది బాలికలు ఉన్నారు. వారిలో 22,752 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా 1,414 మంది ఒన్‌ ఫెయిల్డ్‌ విద్యార్థులున్నారు.

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్‌ :

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టికెట్ల కోసం స్కూళ్లు చుట్టూ తిరగనవసరం లేకుండా వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. విద్యార్థులు పరీక్షా హాల్‌టికెట్‌ను వెబ్‌సైట్‌లో నేరుగా పొందువచ్చు.

ఆర్‌టీసీలో ఉచిత ప్రయాణం : పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. బాలురు, బాలికలనే తేడా లేకుండా పరీక్ష సమయంలో విద్యార్థులు తమ గ్రామాల నుంచి పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ బస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష హాల్‌ టికెట్‌ను చూసిస్తే సరిపోతుంది.

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని 132 పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాం. పరీక్షల నిర్వహణకు దాదాపు 1,800 మంది ఇన్విజిలేటర్లు, 22 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, రాష్ట్ర, జిల్లాస్థాయి అబ్జర్వర్స్‌ పనిచేస్తున్నారు.

– ఇ నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం

పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. 16వ తేదీన ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకండ్‌ లాంగ్వేజ్‌, 21న ఇంగ్లీష్‌, 23న మ్యాథ్స్‌, 25న ఫిజికల్‌ సైన్స్‌, 28న బయాజికల్‌ సైన్స్‌, 30న సోషల్‌ స్టడీ, 31న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2, ఏప్రిల్‌ 1వ తేదీన ఎస్‌ఎస్‌సీ ఆప్షనల్‌/ ఇతర సబ్జెక్టులు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement