బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు | - | Sakshi
Sakshi News home page

బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు

Feb 28 2026 1:27 PM | Updated on Feb 28 2026 1:27 PM

బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు

బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు

ఏలూరు (టూటౌన్‌): తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లను బెదిరించి, నిర్బంధించి ఉద్యమాన్ని ఆపలేరని, వచ్చేనెల 2న చలో విజయవాడకు పిలుపునిస్తున్నట్టు సీఐటీయూ అనుబంధ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అ న్నారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద నాలుగో రోజు శుక్రవారం అంగన్‌వాడీల రిలే దీక్షా శిబిరాన్ని ఆమె ప్రా రంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వికసిత భారత్‌లో అంగన్‌వాడీ వర్కర్లకు చోటులేదా అని ప్రశ్నించారు. కూటమి నేతలు చిరుద్యోగులపై నిర్లక్ష్య వైఖరి వీ డాలని కోరారు. అంగన్‌వాడీలకు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అందకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. మార్చి 2న రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్‌వాడీలు విజయవాడ తరలిరానున్నారన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల ఆందోళనకు ఐఎఫ్‌టీయూ సంపూర్ణ మద్ద తు తెలుపుతున్నట్టు సంఘ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ చెప్పారు. ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ సుందరయ్య మాట్లాడుతూ కూ టమి నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలు గత రెండేళ్లలో వేటిని అమలు చేశారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్సులు పి.హైమావతి, ఎ.రాణి మద్దతు తెలిపారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌, నాయకులు ఎం.ఇస్సాక్‌, అమర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement