తల్లి ప్రేమ మాటల్లో చెప్పలేనంత గొప్పది. అందుకు నిదర్శనమే ఈ చిత్రాలు. సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ హైవే సర్వీస్ రోడ్డులో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని కుక్కపిల్ల మృతిచెందింది. తల్లి కుక్క గమనించి కుక్కపిల్లను లేపేందుకు ప్రయత్నించింది. అది ఎంతకూ లేవకపోవడంతో గట్టిగా అరిచింది. చుట్టుపక్కల వారు కుక్కపిల్లను రోడ్డు పక్కన పెట్టడంతో దాని వంక తల్లి కుక్క, మిగతా కుక్కపిల్లలు దీనంగా చూస్తూ ఉండిపోయాయి.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట


