ఆహ్లాదకరమైన వాతావరణానికే మోడల్ పోలింగ్ కేంద్రాలు
మిర్యాలగూడలో ఘర్షణలు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మిర్యాలగూడలోని పలు వార్డులు రణరంగాన్ని తలపించాయి.
- 8లో
సాక్షి,యాదాద్రి : ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం పోచంపల్లి మున్సిపాలిటీ, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెంలో, భువనగిరి బీచ్ మహల్‌లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని కొత్త గుండ్లపల్లి, ఆలేరు మున్సిపాలిటీలోని గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. పోలింగ్ సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
పచ్చదనంపై అవగాహనకే..
భూదాన్‌పోచంపల్లి: పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు జిల్లాలో వి నూత్నంగా మున్సిపాలిటీకి ఒక ఎకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీతావానిగూడెంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన వెంట మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు తదితరులున్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


