కేసీఆర్‌పై ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది

Feb 13 2026 7:04 AM | Updated on Feb 13 2026 7:04 AM

కేసీఆర్‌పై ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది

కేసీఆర్‌పై ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది

యాదగిరిగుట్ట: కేసీఆర్‌పై ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందని, ఇందుకు మున్సిపల్‌ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే నిదర్శనమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 7 సీట్లకు పైగా బీఆర్‌ఎస్‌ విజయం సాధించనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున అన్ని కులాలకు ప్రాధాన్యమిచ్చి టిక్కెట్లు కేటాయించామన్నారు. యాదగిరీశుడి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు పట్టణాన్ని కేసీఆర్‌ అభివృద్ధి చేసినందుకు ఓటర్లంతా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు ఓట్లు వేశారన్నారు. కాంగ్రెస్‌ అధికార బలాన్ని వినియోగించి ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన 10వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిని కొనుగోలు చేసిందని ఆరోపించారు. దీనికి బదులుగా బీఆర్‌ఎస్‌ అధిక సీట్లు సాధించి గుట్ట మున్సిపల్‌ పీఠాన్ని కై వసం చేసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డబ్బు అహంకారానికి ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మండల సెక్రటరీ జనరల్‌ కసావు శ్రీనివాస్‌ గౌడ్‌, యూత్‌ ప్రధాన కార్యదర్శి బీమగాని నర్సింహగౌడ్‌, కల్వకొలను సతీష్‌రాజ్‌, ముక్కెర్ల సతీష్‌, మిట్ట నర్సింగ్‌గౌడ్‌, సిరబోయిన నర్సింగ్‌యాదవ్‌, శారాజీ రాజేష్‌ యాదవ్‌, లింగం యాదవ్‌, పరుశరాములు, నాగరాజు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement