యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం అంతరాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు విశేష అభిషేకాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా చేపట్టి సహస్ర నామార్చన పూజ జరిపించారు. ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన పూజను చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించి గజ వాహన సేవ అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణ వేడుకను సంప్రదాయంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.


