కౌంటింగ్‌ పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ పారదర్శకంగా నిర్వహించాలి

Feb 13 2026 7:04 AM | Updated on Feb 13 2026 7:04 AM

కౌంటింగ్‌ పారదర్శకంగా నిర్వహించాలి

కౌంటింగ్‌ పారదర్శకంగా నిర్వహించాలి

భువనగిరిటౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌పై అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కౌంటింగ్‌ అనేది చాలా కీలకమైందన్నారు. రూల్‌ 56 ప్రకారం మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించాలన్నారు. ప్రతి బ్యాలెట్‌ పేపర్‌ కౌంటింగ్‌ ఏజెంట్స్‌ కు చూపించాలన్నారు. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు మాట్లాడుతూ కౌంటింగ్‌లో ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లను నియమించనున్నట్లు తెలిపారు. సక్రమంగా కౌంటింగ్‌ చేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌ రెడ్డి, మాస్టర్‌ ట్రైనర్స్‌ నర్సిరెడ్డి, హరినాథ్‌ రెడ్డి, కౌంటింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అవాంతరాలు లేకుండా చూడాలి

భువనగిరి: ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని కలెక్టర్‌ హనుమంతరావు కోరారు. ఆరు మున్సిపాలిటీలకు సంబంధించి భువనగిరి పట్టణ శివారులోని దివ్యబాల విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్‌ కేంద్రాలను అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి గురువారం పరిశీలించి మాట్లాడారు. పారదర్శకంగా కౌంటింగ్‌ చేపట్టాలని సూచించారు. కౌంటింగ్‌ కోసం భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. సమయపాలన పాటిస్తూ కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగం, పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఫ కలెక్టర్‌ హనుమంతరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement