సాక్షి,యాదగిరిగుట్ట: సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యాదగిరిగుట్ట టెంపుల్ రన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహించగా, భారీ సంఖ్యలో అథ్లెట్స్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట టెంపుల్ రన్‌కు ప్రముఖ రియల్‌ఎస్టేట్ సంస్థ అవంతికా కన్స్ట్రక్షన్ ప్రధాన స్పాన్సర్‌గా నిలిచింది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు ప్రముఖ నగరాల్లో ఎన్నో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను విజయవంతంగా అభివృద్ధి చేసిన అవంతికా కన్ స్ట్రక్షన్ సమాజంలో ఆరోగ్యాన్ని, సంపదను సమానంగా పెంపొందించడమే లక్ష్యంగా నడుం బిగించింది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ రన్‌కు ప్రధాన స్పాన్సర్‌గా ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా అవంతికా కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ యన్నం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ‘సమాజంలో ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, సంపదను పెంపొందించడమే మా ముఖ్య ఉద్దేశ్యం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కొనసాగిస్తాం’ అని హామీ ఇచ్చారు.
యాదగిరిగుట్ట టెంపుల్ రన్ 2026 కేవలం ఒక రన్ మాత్రమే కాదు, ఇది ఆరోగ్యాన్ని,ఆధ్యాత్మికతను, సమాజాన్ని కలిపే ఒక వేదికగా నిలిచింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక స్ఫూర్తిదాయక యాత్రగా మారిందని నిర్వాహకులు కొనియాడారు.

10 కిలోమీటర్ల విభాగంలో విజేతలు
పురుషుల ఓపెన్ కేటగిరీ: విజయ్ నెహ్రా
మహిళల ఓపెన్ కేటగిరీ: సాక్షి పలోజ్
పురుషుల 45 సంవత్సరాల కేటగిరీ: వెంకట్
మహిళల 45 సంవత్సరాల కేటగిరీ: పద్మ
ఆఫ్ మారథాన్ విభాగంలో విజేతలు
పురుషుల కేటగిరీ: మంచికంటి లింగన్న
మహిళల కేటగిరీ: గడ్డం రాజేశ్వరీ యాదవ్
పురుషుల 45 సంవత్సరాల కేటగిరీ: రవీందర్ ఎడ్ల
మహిళల 45 సంవత్సరాల కేటగిరీ: అనీ పార్హీ

ఈ కార్యక్రమం ద్వారా ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడమే లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పరిసరాల్లో నిర్వహించిన ఈ పరుగుల పోటీలు భక్తులు, యువతలో విశేష ఉత్సాహాన్ని నింపాయి. విజేతలకు నిర్వాహకులు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు.


