వైభవంగా ధ్వజారోహణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ధ్వజారోహణం

Feb 14 2026 10:20 AM | Updated on Feb 14 2026 10:20 AM

వైభవంగా ధ్వజారోహణం

వైభవంగా ధ్వజారోహణం

యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం రెండవ రోజుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా యజ్ఞబ్రహ్మ ఆధ్వర్యంలో ఆలయ సిద్ధాంతి, ఆలయ ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకులు, పురోహితుల సమక్షంలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలను జరుగుతున్నాయి. ఆలయ మండపంలో నిత్య హవనం, శివ పంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనం, మూలమంత్ర జపంతో పాటు వివిధ పారాయణాలు చేశారు.

భేరీ పూజ, దేవతాహ్వానం...

శివాలయంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరమ శివుడి వాహనమైన నందీశ్వర చిత్రమైన ధ్వజ పటాన్ని అర్చించి, ఆయా ఉపచారములను చేపట్టారు. అనంతరం ధ్వజ స్తంభంపై అలంకరించారు. అనంతరం భేరీ పూజ, దేవతాహ్వానం చేపట్టారు.

అగ్ని ప్రతిష్ఠ..

శివరాత్రి మహోత్సవాలకు వేంచేసిన సకల దేవతలకు అగ్ని ముఖంగా హవిస్సులు అందించి పంచ సూక్త హవనములు, మూలమంత్ర జములతో దశాంక తర్పణాదులు చేపట్టి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకను హోమ మండపంలో చేపట్టారు. ఆయా వేడుకల్లో ఈవో భవానీ శంకర్‌, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ అర్చకులు, అధికారులు, యాజ్ఞీకులు పాల్గొన్నారు.

సాయంత్రం వేళ..

ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళ పారాయణీకులచే స్తోత్ర, వేద, నమక, చమక పారాయణాలు, మంత్రపుష్ప పఠనం, సోమకుంభార్చనలు, మూలమంత్ర పారాయణాలు యథావిధిగా నిర్వహించారు. అనంతరం లఘుపూర్ణాహుతి కార్యక్రమం చేశారు.

ఫ రెండో రోజుకు చేరిన శివరాత్రి ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement