భువనగిరి ఖిలాపై కాంగ్రెస్ జెండా
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీ ఎన్నికల్లో భువనగిరి ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగిరిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను శుక్రవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శాసన సభ ఎన్నికల్లో 40 సంవత్సరాల చరిత్రను తిరిగి రాసే విధంగా భువనగిరి నియోజకవర్గం ప్రజల తీర్పు ఇచ్చారని ఇదే స్ఫూర్తితో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారన్నారు. దాదాపు మొత్తం 35 వార్డుల్లో 27 స్థానాలు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. భువనగిరి పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.


