రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు ఎంపిక

Feb 12 2026 11:33 AM | Updated on Feb 12 2026 11:33 AM

రాష్ట

రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు ఎంపిక

బొమ్మలరామారం: మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో బుధవారం జిల్లా స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఎంపికై నట్లు పీడీ నర్సింహ తెలిపారు. ఈ నెల 13, 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న 45వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్స్‌ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఐలయ్య, జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మోత్కూరు యాదయ్య, స్థానిక హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి, విజయభారతి, బండి నవీన్‌ పాల్గొన్నారు.

మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు

రామగిరి(నల్లగొండ) : మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్‌ఎం కె.జానిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ డిపో నుంచి శ్రీశైలం, కోదాడ డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, హుజుర్‌నగర్‌ నుంచి మేళ్లచెర్వుకు, మిర్యాలగూడ డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. సూర్యాపేట డిపో నుంచి శ్రీశైలం, కోటప్పకొండ, నల్లగొండ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు.

యాదగిరీశుడికి విశేష పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు విశేషంగా అభిషేకం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన పూజలు చేశారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు నిర్వహించారు. ఇక.. సాయంత్రం జోడు సేవను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

దాడులకు పాల్పడితే గుణపాఠం తప్పదు

మిర్యాలగూడ : అధికార బలంతో కాంగ్రెస్‌ పార్టీ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని తగిన గుణపాఠం చెబుతామని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి హెచ్చరించారు. బుధవారం మిర్యాలగూడలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడ మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా 29వ వార్డులో ఎన్నికల సమయం ముసిగిన తరువాత మిత్రపక్షాల అభ్యర్థికి చెందిన ఏజెంట్లు మస్తాన్‌, జమీల్‌, చాంద్‌పాషాపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జావిద్‌, ఆయన అనుచరులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు.

రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు ఎంపిక1
1/1

రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement