ఫాంపాండ్‌లో మునిగి విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

ఫాంపాండ్‌లో మునిగి విద్యార్థి మృతి

Feb 16 2026 8:02 AM | Updated on Feb 16 2026 8:02 AM

ఫాంపా

ఫాంపాండ్‌లో మునిగి విద్యార్థి మృతి

భువనగిరిటౌన్‌: మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి వసతి గృహం సమీపంలోని ఫాంపాండ్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి అందులో మునిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన ఆంథోనిరాజు, దీపారాణి దంపతుల కుమారుడు బాలఆకాష్‌(16), మరో విద్యార్థి రహమత్‌ అలీఖాన్‌ భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం ఉదయం పాఠశాల వసతి గృహం నుంచి వారిద్దరు బయటకు వెళ్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఫాంపాండ్‌లో స్నానం చేసేందుకు దిగారు. లోతు అంచనా వేయలేక, ఈత రాకపోవడంతో బాలఆకాష్‌ ఫాంపాండ్‌లో మునిగిపోయాడు. మరో విద్యార్థి రహమత్‌ అలీఖాన్‌ వెంటనే పాఠశాలకు వచ్చిన సిబ్బందికి విషయం చెప్పాడు. సిబ్బంది వెళ్లేసరికి అప్పటికే బాలఆకాష్‌ మృతిచెందాడు. మృతదేహాన్ని ఫాంపాండ్‌ నుంచి బయటకు తీసి భువనగిరి ఏరియా ఆస్పత్రిక తరలించారు. మరో విద్యార్థి రహమత్‌ అలీఖాన్‌ అస్వస్థతకు లోనుకావడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పరీక్ష రాసి వస్తాడనుకున్నాం..

తమ కుమారుడు బాలఆకాష్‌ మరికొన్ని రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వస్తాడని అనుకున్నామని.. కానీ ఇలా విగతజీవిగా ఇంటికి తీసుకెళ్తామని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని బాలఆకాష్‌ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ వచ్చే వరకు పోస్టుమార్టం చేయకూడదని పట్టుబట్టారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.

మైనార్టీ గురుకుల పాఠశాల సిబ్బంది

నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ

భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట

బంధువుల ఆందోళన

ఫాంపాండ్‌లో మునిగి విద్యార్థి మృతి1
1/1

ఫాంపాండ్‌లో మునిగి విద్యార్థి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement