మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో బీసీలకు 70 శాతం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో బీసీలకు 70 శాతం ఇవ్వాలి

Feb 15 2026 12:47 PM | Updated on Feb 15 2026 12:47 PM

మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో బీసీలకు 70 శాతం ఇవ్వాలి

మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో బీసీలకు 70 శాతం ఇవ్వాలి

భువనగిరిటౌన్‌ : మున్సిపల్‌ చైర్మన్‌ సీట్లలో బీసీలకు 70 శాతం ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవులు మూడు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం భువనగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలు 70 శాతం మంది పోటీ చేస్తే 60 శాతం మంది విజయం సాధించారని, ఇది బీసీల రాజకీయ చైతన్యానికి నిదర్శనమని అన్నారు. జనరల్‌ స్థానాలంటే రెడ్డి, రావులది కాదని, అందులో అందరికీ అవకాశం ఉంటుందన్నారు. బీసీలు అగ్రకులాల మాటలు నమ్మవద్దని, ‘మనమెంతో మనకు అంత’ అనే నినాదంతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

గుర్తుతెలియని వ్యక్తి

మృతదేహం లభ్యం

భువనగిరి: మండలంలోని రాయగిరి గ్రామ చెరువు వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పెట్రోలింగ్‌ పోలీసులు గుర్తించి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయని, భిక్షగాడిలా కనిపిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 62472, 87126 62733 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement