ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్‌దే హవా
యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ హవానే కొనసాగుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని తన నివాసంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం ఇదే సీన్ రిపీట్ అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటయ్యాయని, వారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నిలిచారన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ను ఓటర్లు మరోసారి చిత్తు ఓడించారని, బీజేపీతో చీకటి ఒప్పందాలను తిప్పికొట్టారన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజలకు ఏమీ చేయలేదనే ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ చీర సత్యనారాయణ, మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, జంగమ్మ, మండల కార్యదర్శి మహేందర్, ధర్మారెడ్డి గూడెం సర్పంచ్ రాజయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌నర్సయ్యగౌడ్ ఉన్నారు.
ప్రమాణస్వీకారం సమయానికి
వైస్‌చైర్మన్ల పేర్లను ప్రకటిస్తాం
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీకి బీజన బాలమణి, యాదగిరిగుట్టకు గుండ్లపల్లి వాణిని చైర్‌పర్సన్‌లుగా ఎంపిక చేసినట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. శనివారం ఆలేరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైస్ చైర్మన్‌ల పేర్లు కూడా అధిష్టానానికి పంపించామన్నారు. ఎంపికలో సామాజిక సమీకరణలు ఇతర అంశాలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం ప్రమాణస్వీకారం జరిగే సమయానికి వైస్‌చైర్మన్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు ఆకవరం మోహన్‌రావు, ఇజాజ్, ముదిగొండ శ్రీకాంత్, ఎగ్గిడి యాదగిరి, సాగర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌గౌడ్, జైనోద్దిన్, సీపీఐ నాయకుడు చెక్క వెంకటేష్, సీపీఎం నాయకుడు ఇక్బాల్ పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


