16న ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

16న ప్రజావాణి రద్దు

Feb 15 2026 12:47 PM | Updated on Feb 15 2026 12:47 PM

16న ప

16న ప్రజావాణి రద్దు

భువనగిరిటౌన్‌ : జిల్లా అధికారులు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున, ఈ నెల 16న సోమవారం ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ హనుమంత రావు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలి

భువనగిరిటౌన్‌ : గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్‌గ్రేషియా నిధులు విడుదల చేయాలని కేజీకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయ రాములు డిమాండ్‌ చేశారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఫంక్షన్‌ హాల్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు రాగీరు కృష్ణయ్య అధ్యక్షతన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి సంక్షేమానికి బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలన్నారు. ఈ నెల 17న ఇందిరా పార్క్‌ వద్ద రాష్ట్ర కమిటీ సభ్యుల సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు, అంతటి అశోక్‌, జిల్లా ఉపాధ్యక్షులు భావండ్లపల్లి బాలరాజు, బత్తుల లక్ష్మయ్య, సూదగాణి రామచంద్రయ్య, కొ క్కొండ లింగయ్య, సహాయ కార్యదర్శి పల్సం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

దారి పునరుద్ధరణ

యాదగిరిగుట్ట: యాదగిరి కొండకు దిగువన ఆర్యవైశ్య సత్రం నుంచి మొదటి ఘాట్‌ రోడ్డులోని జీయర్‌ కుటీర్‌ వరకు శ్రీస్వామి వారి కొండపైకి భక్తుల వాహనాలు వెళ్లేందుకు నూతనంగా బ్రిడ్జి నిర్మిస్తుండడంతో 5నెలలుగా వైకుంఠద్వారం నుంచి బ్రిడ్జి వైపు దారిని మూసివేశారు. ప్రస్తుతం బ్రిడ్జి పనులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో బ్రిడ్జికి కింద ఏర్పాటు చేసిన ఇనుప పిల్లర్లను తొలగించారు. దీంతో వైకుంఠద్వారం నుంచి ఆర్యవైశ్య సత్రం పక్క నుంచి బ్రిడ్జి కిందుగా వాహనాలు వెళ్లే విధంగా మార్గాన్ని పునరుద్ధరించారు.

రాచకొండలో శివరాత్రి సందడి

సంస్థాన్‌ నారాయణపురం: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సంస్థాన్‌నారాయణపురం మండలంలోని రాచకొండలో స్వయంభూలింగేశ్వర శివాలయాన్ని సిద్ధం చేశారు. అదేవిధంగా రాచప్ప సమితి ఆధ్వర్యంలో రాచకొండ పర్యాటక ఉత్సవాలు, హజ్రత్‌ గాలిబ్‌ షాహిద్‌ దర్గాలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.

16న ప్రజావాణి రద్దు 1
1/1

16న ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement