16న కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం | - | Sakshi
Sakshi News home page

16న కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం

Feb 15 2026 12:47 PM | Updated on Feb 15 2026 12:47 PM

16న కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం

16న కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం

సాక్షి,యాదాద్రి : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో ఎన్నికై న వార్డు కౌన్సిలర్లతో సోమవారం ప్రమాణ స్వీకారం చేయించాలని కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో మున్సిపల్‌ ఎన్నికల స్పెషల్‌ ఆఫీసర్స్‌, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉదయం 11 గంటలకు వార్డు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు మాట్లాడుతూ.. మంచి వాతావరణంలో మున్సిపల్‌ చైర్మన్‌ , వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయించాలన్నారు. ఎన్నిక ఆథరైజ్‌గా ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక అధికారిని నియమించడం జరిగిందని, భువనగిరి మున్సిపాలిటీ ఆర్థరైజ్డ్‌ ఆఫీసర్‌ గా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు , యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి గ్రామీణ అభివద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి , పోచంపల్లి మున్సిపాలిటీ కి సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌ రెడ్డి, ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి ఆర్డిఓ కష్ణారెడ్డి, చౌటుప్పల్‌ మున్సిపాలిటీకి ఆర్డిఓ శేఖర్‌ రెడ్డి, మోత్కూర్‌ మున్సిపాలిటీకి సంబంధించి అడిషనల్‌ డిఆర్డిఓ సురేష్‌ ను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్స్‌ నర్సిరెడ్డి, హరినాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ హనుమంతరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement