పేలుడుతో భారీ నష్టం
చౌటుప్పల్ మండలం ఎల్లగిరి శివారులోని లేబొరేటరీస్‌లో రియాక్టర్ పేలుడుతో భారీ నష్టం వాటిల్లింది.
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
- 8లో
శివపార్వతుల కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మూడవ రోజైన శనివారం ఆలయంలో నిత్య హవనం, శివపంచాక్షరీ జపం, నందీశ్వర పారాయణం, పంచ సూక్త పఠనం చేశారు. యజ్ఞ బ్రహ్మ ఆధ్వర్యంలో రుద్ర హవనం జరిపించారు. సాయంత్రం స్తోత్ర, వేద, నమక, చమక పారాయణములు, మంత్ర పుష్ప పఠనం నిర్వహించారు. శివాలయ ఉత్తర దిశలోని కల్యాణ మండపంలో రాత్రి 8గంటలకు శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరుడి కల్యాణం జరిపించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పేలుడుతో భారీ నష్టం


