యూరియా యాప్‌ను రద్దుచేయాలి
ఆలేరు రూరల్ : యూరియా యాప్‌ను రద్దు చేసి, బ్లాక్ దందాను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ అన్నారు. శనివారం ఆలేరు పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంక్ కార్యాలయం ఎదుట ఽసీపీఐ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. యూరియా స్లాట్ బుకింగ్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే యాప్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటేనే యూరియా ఇస్తామనడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు గిరిబోయిన స్వామి, గణేష్, ఓదయ్య, ఐలయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


