బిగ్ బాస్ ఫేమ్ మనీషా రాణి ముంబైలోని లగ్జరీ హౌస్ నెట్టింట సందడిగా మారింది. భారీ వార్డ్‌రోబ్‌తో కూడిన గ్లామ్ రూం , విశాలమైన బాల్కనీతో ఉండే మనీషా రాణి "డ్రీమ్ హౌస్" విశేషాలపై ఫ్యాన్స్ అబ్బురపడుతున్నారు. మే 1వ తేదీన మనీషా రాణి తన కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సహా తన ప్రియమైన వారి సమక్షంలో, సాంప్రదాయ దుస్తుల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను ఇనష్టాలో షేర్ చేశారు. పదండి ఆ వివరాలేంటో తెలుసు కుందాం.
బిగ్ బాస్ OTT 2లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన మనీషా రాణి తన చలాకీతనం, మాట్లాడే శైలితో బాగా పాపులర్ అయింది. ఆమెకు ఇన్‌స్టా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్నారు. ఝలక్ దిఖ్లా జా 11 విజేతగా గుర్తింపు పొందిన మనీషా రాణి, ముంబైలో తన కలల ఇల్లును కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ. 5 కోట్లు.
ఇంటీరియర్, డిజైన్
ఈ ఇల్లు ఆధునిక శైలిలో, విశాలమైన గదులతో ఉంటుంది. గోడలకు పాస్టెల్ రంగులు (Muted tones) ఉపయోగించారు, అక్కడక్కడా వైబ్రెంట్ రంగులతో ఇంటికి కొత్త లుక్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.
లివింగ్ రూమ్ చాలా విశాలంగా, వెలుతురు వచ్చేలా ఉంటుంది. స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా సౌకర్య వంతంగా కూడా ఉంటుంది. ఈ గది ఆధునిక ఇంటీరియర్ డిజైన్‌లు,ట్రెండీ లైటింగ్ , గాలి ధారాళంగా వచ్చేలా క్రాస్-వెంటిలేషన్ సౌకర్యం ఉంది.

వార్డ్ రోబ్
అది పెద్ద కిచెన్ దీని మరో ప్రత్యేకత. ప్యారలల్ లేఅవుట్‌తో మార్బుల్ ఫినిషింగ్ కౌంటర్లు , స్టైలిష్ క్యాబినెట్‌లతో వంటగదిని చాలా అందంగా తీర్చిదిద్దారు. అంతేకాదు తన దుస్తుల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద వార్డ్‌రోబ్‌తో కూడిన గ్లామ్ రూమ్‌ను సిద్ధం చేసుకోవడం విశేషం. అందంగా, స్టైల్‌గా డిజైన్ చేయబడిన ఈ విశాలమైన వార్డ్‌రోబ్‌లో, బట్టలు, బూట్లు, యాక్సెసరీల కోసం చక్కగా అమర్చిన అరలు, చక్కటి స్టోరేజ్ ప్లేస్, విలాసవంతమైన ఏర్పాటు ఉన్నాయి. ఇది ఫ్యాషన్‌పై ఆమెకున్న ప్రేమను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. ముంబై నగరాన్ని వీక్షించేలా పెద్ద బాల్కనీ, దానికి ఫ్లోర్-టు-సీలింగ్ కిటికీలు ఉండటంతో ఇల్లు మరింత లగ్జరీగా కనిపిస్తుంది ఫైనల్లీ తన కలనెరవేరింది అంటూ తన ఇంటిగృహప్రవేశ ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసిందీ ఈ బీహారీ చిన్నది.
ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను


