పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఘాటుగా స్పందించారు. పొదుపు చర్యలు అధికారంలో ఉన్నవారితోనే ప్రారంభం కావాలని హితవు పలికారు.
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో తన 'గోవిష్ట్ యాత్ర' సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజలను ఖర్చులు తగ్గించుకోవాలని కోరేముందు, ప్రభుత్వమే ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ డాలర్ విలువ రూ. 100కు చేరువవుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడాలి, వర్క్ ఫ్రం హోం, బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మంత్రపై ఆయన గట్టి చురక లేశారు.
ముందు రూ. 8,000 కోట్ల విమానాన్ని అమ్మండి
ధర్మం అనేది ఇంటి నుండే మొదలవ్వాలి (Austerity begins at home)" అన్న అవిముక్తేశ్వరానంద ముందు రూ. 8,000 కోట్ల విలువైన విమానాన్ని అమ్మేసి, తక్కువ ఇంధనం ఖర్చయ్యే విమానాలను వాడాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు ఆవుల సంఖ్య తగ్గి పోతోందంటూ యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఉత్తరప్రదేశ్‌లో గోవధను అరికట్టడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. కేరళ (8%), పశ్చిమ బెంగాల్ (15%), జార్ఖండ్ (24%) వంటి రాష్ట్రాల్లో ఆవుల జనాభా పెరగగా, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం గణనీయంగా తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకించారు. గోవధకు పాల్పడే వారి నుంచి డబ్బులు తీసుకుంటూ కొందరు నాయకులురాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఓటర్లు నమ్మకూడదని పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజు కంటే సన్యాసి పదవి చాలా ఉన్నతమైనదని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ద్వారా తన ఉన్నత స్థానం నుండి కిందకు దిగజారారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఒక సీఎం మాత్రమే, సన్యాసి(పీఠాధిపతి) కాదంటూ విమర్శించారు. అలాగే యూపీ ప్రభుత్వ గోశాలల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నాయకులు ,రాజకీయ పార్టీలు గోవధను అరికట్టడంలో విఫలమయ్యారు. అందుకే, తాము గోవులను ప్రేమించే ఓటర్లను సంప్రదించి,వారిలో అవగాహన కల్పిస్తున్నా మన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, గోవుల సంరక్షణ, వాటి గౌరవాన్ని పునరుద్ధరించడంపై ఓటర్లలో అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని శంకరాచార్యులు తెలిపారు.
ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?
కాగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్దం, హర్మోజ్ జలసంధి మూసివేత సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఆ ఏడాదిందా బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్వామి అవిముక్తేశ్వరానంద ఘాటుగా స్పందించడం గమనార్హం.
ఇదీ చదవండి : అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్,స్పెషల్ ఏంటంటే?


