ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు | China woman marries 25 year model gifts luxury cars Rs 60 crore | Sakshi
Sakshi News home page

ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు

Apr 3 2026 2:36 PM | Updated on Apr 3 2026 4:11 PM

China woman marries 25 year model gifts luxury cars Rs 60 crore

చైనాకు చెందిన వ్యాపారవేత్త యు వెన్‌హాంగ్ (Yu Wenhong), తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు సుమారు రూ. 60 కోట్ల కట్నం,  విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన వైనం పెళ్లి కాని ప్రసాదులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనా మెడికల్ ఈస్తటిక్స్ రంగంలో ప్రముఖురాలైన యు వెన్‌హాంగ్ (55), 25 ఏళ్ల లియు యుచెన్ (Liu Yuchen) అలియాస్ రెన్‌రెన్‌ను వివాహం చేసుకుంది.  యు, యుచెన్ (రెన్‌రెన్)  ఈ మార్చిలో  పెళ్లాడింది. పెళ్లి సందర్భంగా తన భర్తకు సుమారు 50 మిలియన్ యువాన్ల (సుమారు రూ.60 కోట్లు) విలువైన నగదు, విలాసవంతమైన ఇళ్లు, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిందట.

(పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్‌లు, వీడియో వైరల్‌)

ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరడంతో వీరి ప్రేమ చర్చల్లో నిలిచింది. మరోవైపు లియు యుచెన్  తమ సంబంధం గురించి మాట్లాడుతూ, ఇంత విలాసవంతమైన జీవితాన్ని తాను ఊహించలేదని, కానీ ఆమె ప్రేమను, వచ్చిన అవకాశాన్ని ఉప యోగించుకున్నానని భర్త లియు యుచెన్ పేర్కొనడం గమనార్హం. కాగా యుకు గతంలోనూ వివాహాలు అయ్యాయి. అలాగే ఒక విదేశీ మోడల్‌ అల్బేనియన్ మోడల్ Rolando Lekajతో   పదేళ్ల రిలేషన్‌షిప్‌లో  ఉంది. వీరికి ఒక బిడ్డ కూడా.

ఇదీ చదవండి : రూ. 37 లక్షలు, ఒరాకిల్‌ లేఆఫ్‌ : ఈ టెకీ ప్లాన్‌ మామూలుగా లేదు!

వీరిద్దరి పరిచయం ఎలా
2025లో లైవ్ స్ట్రీమింగ్‌లో  వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమైనారు.  ఈ  పరిచయం వారిని మరింత దగ్గర చేసింది.  ఆ తరువాత యు అతనికి రోల్స్-రాయ్స్, మెర్సిడెస్-బెంజ్ మోడళ్ల వంటి ప్రీమియం కార్లతో సహా అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇచ్చిందని చెబుతున్నారు.

నెటిజన్లు స్సందన 
మల్టీ మిలియన్‌ డాలర్ల  డౌరీ కథ చైనీస్ సోషల్ మీడియా అంతటా మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొంతమంది వినియోగ దారులు యు విజయాన్ని, ఆర్థికంగా ఎదిగిన తీరును అభినందిస్తుండగా,  ఈ ఉదంతం చైనాలో మారుతున్న సామాజిక విలువలు, సంపద, స్త్రీ-పురుష సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది.

యు వెన్‌హాంగ్  సక్సెస్‌ స్టోరీ

సామాన్య కుటుంబంనుంచి వ్యాపారవేత్తగా యు ఎదిగిన తీరు అసామాన్యం. ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లోని డాలియన్‌లో ఒక సాధారణ ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. తండ్రి మరణం తర్వాత 18 ఏళ్లకే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో ఐబ్రో టాటూ టెక్నీషియన్‌గా కెరీర్ ప్రారంభించి, పట్టుదలతో 2004లో హాంగ్‌కాంగ్‌లో 'యంగ్ మెర్రీ రియల్ ఇంటర్నేషనల్ గ్రూప్'ను స్థాపించింది. ఆమె తనను తాను 'సెల్ఫ్ మేడ్' మహిళగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వ్యాపారం చైనా వ్యాప్తంగా వందలాది బ్రాంచ్‌లతో విస్తరించింది.

వ్యాపార వివాదాలు : ఆమె కంపెనీకి చెందిన  కొన్ని కాస్మెటిక్ చికిత్సల శాస్త్రీయతపై గతంలో విమర్శలు వచ్చాయి. అలాగే, 2022లో వందల కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement