మేయర్‌ పీఠంపై గురి! | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ పీఠంపై గురి!

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

మేయర్

మేయర్‌ పీఠంపై గురి!

● అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ● హంగ్‌ వస్తుందనే ఆశతో ఎత్తులు

డి.శంకర్‌

వాసాల రమేశ్‌

సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌

చల్ల హరిశంకర్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌ కార్పొరేషన్‌:

మ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే కీలకమైన కరీంనగర్‌ బల్దియా మేయర్‌ పీఠంపై బీసీ నేతలు కన్నేశారు. ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని, తమకే నగర ప్రథమ పౌరుడిగా అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. మేయర్‌ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కాగా, ఆయా పార్టీల నుంచి పలువురు మేయర్‌ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని, హంగ్‌ వస్తే చక్రం తిప్పి మేయర్‌ అవుతామని బీసీ ఆశావహులు పావులు కదుపుతున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలో పోటాపోటీ

మేయర్‌ బీసీ జనరల్‌ కావడంతో ఆ కేటగిరీ నేతల్లో చర్చ మొదలైంది. అధికార పార్టీగా తమకే అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌, వరుసగా మూడోసారి పీఠం తమదేనని బీఆర్‌ఎస్‌, తొలిసారి కాషాయజెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ భావిస్తున్నా యి. దీంతో ఆయా పార్టీల్లో బీసీల నేతల మధ్య పోటీ తీవ్రమైంది. కాంగ్రెస్‌ నుంచి పార్టీ కార్పొరేషన్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ మల్లికార్జున రాజేందర్‌, మాచర్ల ప్రసాద్‌ మేయర్‌ స్థానాన్ని ఆశిస్తున్నారు. అంజన్‌కుమార్‌ 26వ డివిజన్‌ నుంచి, మల్లికార్జున రాజేందర్‌ 46వ డివిజన్‌ నుంచి, మాచర్ల ప్రసాద్‌ 66వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీపడుతున్నారు. బీజేపీ నుంచి మాజీ మేయర్‌ డి.శంకర్‌, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్‌ మేయర్‌ పీఠంపై గురిపెట్టారు. శంకర్‌ 10వ డివిజన్‌ నుంచి, రమేశ్‌ 18వ డివిజన్‌ నుంచి బరిలో ఉన్నారు. వీరితో పాటు పార్టీ గెలిస్తే కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అనూహ్య నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బీఆర్‌ఎస్‌ నుంచి..

బీఆర్‌ఎస్‌ నుంచి పోటీదారుల సంఖ్య కాస్త అధికంగా ఉంది. 21వ డివిజన్‌ నుంచి పోటీచేస్తున్న పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, 58వ డివిజన్‌ నుంచి పోటీచేస్తున్న మాజీ మేయర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌, 23వ డివిజన్‌ నుంచి పోటీపడుతున్న జంగిలి సాగర్‌, 2వ డివిజన్‌ నుంచి పోటీలో ఉన్న నూతి చంద్రయ్య మేయర్‌ స్థానానికి పోటీపడుతున్నారు. బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో తాము కూడా సిద్ధమంటూ బీసీ మహిళలు కూడా సంకేతాలు ఇస్తున్నారు. వీరిలో ఎవరు కార్పొరేటర్‌గా గెలుస్తారో, మేయర్‌ పీఠం ఎవరికి దక్కుతుందో, అనూహ్యంగా ఇతరులకు అవకాశం వస్తుందో వేచి చూడాలి.

మేయర్‌ పీఠంపై గురి!1
1/7

మేయర్‌ పీఠంపై గురి!

మేయర్‌ పీఠంపై గురి!2
2/7

మేయర్‌ పీఠంపై గురి!

మేయర్‌ పీఠంపై గురి!3
3/7

మేయర్‌ పీఠంపై గురి!

మేయర్‌ పీఠంపై గురి!4
4/7

మేయర్‌ పీఠంపై గురి!

మేయర్‌ పీఠంపై గురి!5
5/7

మేయర్‌ పీఠంపై గురి!

మేయర్‌ పీఠంపై గురి!6
6/7

మేయర్‌ పీఠంపై గురి!

మేయర్‌ పీఠంపై గురి!7
7/7

మేయర్‌ పీఠంపై గురి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement