రెండేళ్లలో కరీంనగర్ విధ్వంసమైంది
కరీంనగర్ టౌన్: రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్ అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నగరంలోని 40, 4వ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల కార్యాలయాలను ప్రారంభించారు. బండి సంజయ్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నారని.. తాను కరీంనగర్‌లో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. కేంద్ర మంత్రిగా రెండేళ్లు పూర్తయిన కూడా తీగలగుట్టపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రజలకు అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని.. రెండేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, 40వ డివిజన్ అభ్యర్థి నలువాల పుష్పలత, 4వ డివిజన్ అభ్యర్థి బెజ్జంకి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


