ఆలయాల్లో చోరీ
ఇల్లంతకుంట: మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవా లయం, రహీంఖాన్‌పేటలోని ఎల్లమ్మ దేవాలయంలో శనివారం రాత్రి దొంగలు పడి బంగారం, వెండి వస్తువులు దోచుకెళ్లారని కుల పెద్దలు తెలిపారు. పెద్దమ్మ గుడిలో పుస్తెలు, మెట్టెలు, రహీంఖాన్‌పేట ఎల్లమ్మ గుడిలో పుస్తె మెట్టెలు ఎత్తుకెళ్లినట్లు వాపోయారు. హుండీలు భద్రంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్సై సిరిసిల్ల అశోక్ వివరాలు సేకరించారు. ఫింగర్ ప్రింట్ టీం వేలిముద్రలు సేకరించారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో..
రామగిరి: కల్వచర్ల గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి యత్నించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కల్వచర్ల గ్రామానికి చెందిన కంజార్ల సాగరాచార్యులు జనవరి 28న ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. ఫిబ్రవరి 1న వేకువజామున 2 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అత్త సౌమిత్రి లావణ్యకు ఫోన్ చేసి తెలిపాడు. వెంటనే వచ్చి చూడగా.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా పంపించింది. ఎలాంటి వస్తువులు చోరీకి గురి కాలేదని తెలిపారు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తాడవేని శ్రీనివాస్ తెలిపారు.


