● బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి ● మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

● బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి ● మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

● బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి ● మాజీ ఎంపీ వినోద్‌కుమా

● బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి ● మాజీ ఎంపీ వినోద్‌కుమా

● బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి ● మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

కరీంనగర్‌టౌన్‌: బండి సంజయ్‌ కాగితపు పులి అని, కాంగ్రెస్‌, బీజేపీ ప్రజలకు చేసింది శూన్యమని, మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని 13వ డివిజన్‌ శివనగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంజర్ల రేణుక కార్యాలయాన్ని గురువారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో కలిసి ప్రారంభించారు. 46వ, 50వ డివిజన్లలో బోనాల శ్రీకాంత్‌, వాల రమణారావు తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్‌ హయాంలో గులాబీ జెండా నీడలోనే కరీంనగర్‌ అభివృద్ధి జరిగిందన్నారు. తాను ఎంపీగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు తెచ్చామని గుర్తు చేశారు. కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ ఏడేళ్లలో ఏడు రూపాయల పని చేయలేదన్నారు. 420 హామీలతో అడ్డదారిలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement