మల్కాపూర్‌లో నంది విగ్రహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

మల్కాపూర్‌లో నంది విగ్రహం లభ్యం

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

మల్కాపూర్‌లో నంది విగ్రహం లభ్యం

మల్కాపూర్‌లో నంది విగ్రహం లభ్యం

బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌ గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనుల తవ్వకాల్లో శివలింగం, నంది విగ్రహాలు బయటపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాలు. ఉపాధిహామీ పనులు చేసే పలువురు కార్మికులు మల్కాపూర్‌లోని గోగులగుట్ట పరిధిలో ఉపాధిహామీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో నంది, లింగం రూపంలో ఉన్న విగ్రహాలు వెలుగుచూశాయి. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పూజలు చేశారు. విగ్రహాలు బయటపడ్డ ప్రాంతంలో ఆలయం నిర్మించాలని అనుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

ఉపాధిహామీ పనుల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement