పోలింగ్‌, కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌, కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయాలి

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

పోలింగ్‌, కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయాలి

పోలింగ్‌, కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయాలి

● నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: పోలింగ్‌, కౌంటింగ్‌కు ఏర్పా ట్లు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. శుక్రవారం ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలను సందర్శించారు. పోలింగ్‌ మెటిరియల్‌ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు కౌంటింగ్‌కు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. బ్యాలెట్‌ బాక్సుల కోసం స్ట్రాంగ్‌రూమ్‌లు 1,2లను సిద్ధం చేసి, కౌంటింగ్‌ ప్రక్రియకు టేబుల్‌ ఏర్పాటు చేయాలన్నారు.

సామగ్రి సిద్ధం చేసుకోవాలి

ఎన్నికలకు పోలింగ్‌స్టేషన్‌ ప్రకారం సామగ్రిని రిట ర్నింగ్‌ అధికారులు సిద్ధం చేసుకోవాలని కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అన్నారు. నిర్వహణ పూర్తయ్యే వరకు రిటర్నింగ్‌ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ఆర్‌వోలు పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ డేటాను పరిశీలించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement