పనులు లేక పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

పనులు లేక పరేషాన్‌

Feb 3 2026 7:45 AM | Updated on Feb 3 2026 7:45 AM

పనులు

పనులు లేక పరేషాన్‌

రూ.5.04 లక్షలు చెల్లించాలి

యువతకు ఉపాధి కల్పించాలి

మిడ్‌మానేరు నిర్వాసిత గ్రామాల్లో అన్ని ఇబ్బందులే..

యువతకు ఉపాధి లేదు.. రైతులకు పనులు లేవు..

అడ్డా కూలీలుగా నిర్వాసితులు

రుద్రవరం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

వేములవాడఅర్బన్‌: మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలు అన్నీ.. ఇన్నీ కావు. నిర్వాసితుల కుటుంబాల్లోని యువతకు ఉద్యోగావకాశాలు లేక.. పెద్దమనుషులకు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం ఎదురుచూస్తున్నారు. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌లో కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, శాభాష్‌పల్లి, ఆరెపల్లి, సంకెపల్లి, రుద్రవరం, అనుపురం, కొడుముంజ, గుర్రంవాణిపల్లి, చింతాల్‌ఠాణా, చీర్లవంచ గ్రామాలు ముంపునకుగురయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలకు వేములవాడ మండలంలో పునరావాసం కల్పించారు. ప్రభుత్వం అందించిన స్థలంలో ఇంటి నిర్మాణాలు చేసుకున్నారు. కానీ చాలా హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.

నిర్వాసితుల సమస్యలు ఇవీ..

మిడ్‌మానేరులో ముంపునకు గురైన నిర్వాసితులకు కొందరికి ఇప్పటి వరకు పట్టాలు పరిహారం రాలేదు. గత ప్రభుత్వం ప్రతీ నిర్వాసితుడికి రూ.5.04 లక్షలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. 10,683 నిర్వాసిత కుంటుబాలు ఉండగా 5,987 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు ప్రత్యేక కోటా కింద మాంజూరు చేసింది.

ఉపాధి కరువు

నిర్వాసిత గ్రామాల్లో వ్యవసాయ భూములు లేక, కూలి పనులు దొరక్క ఆటోల్లో ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్తున్నారు. యువతకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు.

ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతీ నిర్వాసితుడికి రూ.5.04 లక్షలు చెల్లించాలి. నిర్వాసితులు సర్వం కోల్పో యి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతున్నాం.

– బుర్ర శేఖర్‌గౌడ్‌, సంకెపల్లి

ప్రాజెక్ట్‌లో సర్వం కోల్పోయి ఉపాధి లేక యువత ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించలేకపోయింది. ఈ ప్రభుత్వమైనా ఉపాధి అవకాశాలు కల్పించాలి.

– శ్రీధర్‌, రుద్రవరం

పనులు లేక పరేషాన్‌
1
1/2

పనులు లేక పరేషాన్‌

పనులు లేక పరేషాన్‌
2
2/2

పనులు లేక పరేషాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement