ఆరు.. తకరారు
కరీంనగర్‌కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక చివరిదశకు చేరుకుంది. 60 ఫైనల్ కాగా ఆరు డివిజన్‌ల పీటముడి వీడ లేదు. ఆరు డివిజన్‌లకు సంబంధించి అధిష్టానం నిర్ణయానికి వదిలేశారు.
60 సింగిల్ నేమ్
కరీంనగర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అర్బన్ బ్యాంక్‌చైర్మన్ కర్ర రాజశేఖర్, వుట్కూరి నరేందర్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఇప్పటికే ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో సమావేశమై 45 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మిగతా అభ్యర్థులను ఖరారు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ రెండోసారి భేటీ అయింది. 21లో 15 డివిజన్‌లకు ఒకే పేరును ప్రతిపాదించారు. 60 డివిజన్‌ల అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపించారు.
కుదరని ఏకాభిప్రాయం
విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని 7, 20,24,33,48,50వ డివిజన్‌లకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ నేతల్లో సఖ్యత కొరవడింది. దీంతో రెండు, మూడేసి పేర్లను పంపించి, ఎంపికను అధిష్టానానికి వదిలేశారు. 53వ డివిజన్‌కు సంబంధించి సభ్యుల నడుమ తీవ్రస్థాయిలో విభేదా లు పొడసూపినట్లు సమాచారం. ఆ డివిజన్ విషయంలో ఓ నేత తన పంతం నెగ్గించుకున్నట్లు ప్రచారం సాగుతోంది.


