పోలింగ్‌కు ఏర్పాట్లు చేయండి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు ఏర్పాట్లు చేయండి

Feb 3 2026 7:45 AM | Updated on Feb 3 2026 7:45 AM

పోలింగ్‌కు ఏర్పాట్లు చేయండి

పోలింగ్‌కు ఏర్పాట్లు చేయండి

పోలింగ్‌కు ఏర్పాట్లు చేయండి ● నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: పోలింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అన్నారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 11న జరిగే పోలింగ్‌ ప్రక్రియకు కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా విద్యుత్‌ సౌకర్యం, లైటింగ్‌, ఫర్నిచర్‌, ర్యాకులు, పార్టీషన్స్‌, వీల్‌ చైర్స్‌ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. రూట్‌ ప్రకారం కావల్సిన బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సౌకర్యం, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

జోనల్‌ అధికారుల నియామకం

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి జోనల్‌ అధికా రులను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్‌ పమేలా సత్పతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చొప్పదండి మున్సిపాల్టీకి నలుగురు, హు జురాబాద్‌ ఐదుగురు, జమ్మికుంట నలుగురు, కరీంనగర్‌ నగరపాలకసంస్థకు 33 మందిని నియమించారు. నగరపాలకసంస్థకు ముగ్గురు, మున్సిపాల్టీలకు ఒక్కొక్కరి చొప్పున రిజర్వ్‌డ్‌లో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement