ఉరేసుకొని వలస కూలీ ఆత్మహత్య
మేడిపల్లి: భీమారంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక వలస కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి వివరాల ప్రకారం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం బందెమర్‌కు చెందిన కుర్సింగా శేకు కొంతకాలంగా భీమారం మండల కేంద్రంలోని గంగారాం పౌల్ట్రీఫాంలో కూలీగా పనులు చేస్తున్నాడు. నెలవారీగా వచ్చే జీతం సరిపోక.. ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసయ్యాడు. పౌల్ట్రీఫాంలోని ఓ గదిలో ఆదివారం ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి సోము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భార్యతో దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
పెళ్లికి నిరాకరించారని..
కోరుట్ల రూరల్: పట్టణంలోని నక్కల గుట్ట ప్రాంతానికి చెందిన గోగుల నరేశ్(23) అనే యువకుడు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చిరంజీవి వివరాల ప్రకారం.. నరేశ్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పగా.. ఇద్దరు అన్నలకు పెళ్లి కాకుండా నువ్వేలా చేసుకుంటావని నిరాకరించారు. మనస్తాపానికి గురైన నరేశ్ నక్కల గుట్ట శివారులోని ఓ మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు. నరేశ్ అన్న సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
గొర్రెల మృతికి రూ.3లక్షల పరిహారం
వేములవాడరూరల్: వేములవాడ మండలం మ ర్రిపల్లి శివారులో ఓ రైస్‌మిల్ నిర్వాహకుడు ము క్కిన బియ్యం బయటపడేయడంతో ఇటీవల మూగజీవాలు బుక్కి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై గొర్రెల కాపరులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజులుగా కొంతమంది పెద్దమనుషులతో సంప్రదింపులు జరిపిన మిల్లు య జమాని ఎట్టకేలకు రూ.3 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు తెలిసింది.
వాగు నుంచి ఇసుక తరలింపు
వేములవాడరూరల్: లింగంపల్లి మూలవాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ ఆదివారం రోజు అనుమతులు లేకుండా ఇసుకను తరలించినట్లు తెలిసింది. వాగులోనే కొంతమంది కూలీలతో ఇసుకను నింపి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నేడు జాతర సమీక్ష సమావేశం
వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగే మహాశివరాత్రి జాతర మహోత్సవాల సమీక్ష సమావేశం కలెక్టర్ గకీమా అగ్రవాల్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి ప్రకటనలో తెలిపారు. జాతర సమన్వయ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పనుల పురోగతిపై వివిధ శాఖల అధి కారులతో సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
ఉరేసుకొని వలస కూలీ ఆత్మహత్య


