నాచుపల్లి జేఎన్టీయూలో ప్రాంగణ నియామకాలు | - | Sakshi
Sakshi News home page

నాచుపల్లి జేఎన్టీయూలో ప్రాంగణ నియామకాలు

Feb 3 2026 7:45 AM | Updated on Feb 3 2026 7:45 AM

నాచుపల్లి జేఎన్టీయూలో ప్రాంగణ నియామకాలు

నాచుపల్లి జేఎన్టీయూలో ప్రాంగణ నియామకాలు

కొడిమ్యాల: నాచుపల్లి జేఎన్టీయూలో వర్టికల్‌ సొల్యూషన్స్‌ ఆధ్వర్యంలో ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌, యూనిటెక్‌, వీటెక్‌ సంస్థలు సోమవారం ప్రాంగణ నియామకాలు చేపట్టాయి. రెండు దశల్లో సాగిన ఎంపిక ప్రక్రియలో ట్రిపుల్‌ఈ, మెకానికల్‌, ఈసీఈ ఫైనలియర్‌ విద్యార్థులు 110 మంది ఎంపికై నట్లు సంస్థ హెచ్‌ఆర్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ సబరీ తెలిపారు. వీరందరికీ ఏటా రూ.2.40లక్షల వేతనం ఉంటుందని, ఉచిత వసతి, రవాణా సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌ నరసింహ అభినందించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ప్రాంగణ నియామకాల అధికారి సతీశ్‌, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

110 మంది విద్యార్థులు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement