కృత్రిమ మేధా అవసరం ఎంతో ఉంది
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఆర్థిక స్వావలంబనలో కృత్రిమ మేధా అవసరం ఎంతో ఉందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం పొఫెసర్ కృష్ణారెడ్డి అన్నారు. శాతవాహన యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం అనే అంశంపై జరుగుతున్న రెండు రోజుల జాతీయస్థాయి సెమినార్‌కు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్ రంగంలో కృత్తిమ మేధస్సు విరివిగా ఉపయోగిస్తున్నారని, శాస్త్ర సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు టూల్స్‌ను ఉపయోగించి ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటును సాధించవచ్చునని అన్నారు. కృత్రిమ మేధస్సుతో సమాచార రంగంలో వస్తున్న డిజిటల్ మార్పులను, ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న అభివృద్ధిని, భవిష్యత్తులో చేయాల్సిన పరిశోధనలను వివరించారు. రిజిస్ట్రార్ సతీశ్‌కుమార్, డి.హరికాంత్, కె.పద్మావతి, కే.శ్రీవాణి, వరప్రసాద్, సూరేపల్లి సుజాత, అబ్రారుల్ బాకీ, జాఫర్, ఉమేరా తస్లీమ్, మునావర్ పాల్గొన్నారు.
సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుతకాలంలో కేన్సర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించే అవకాశం ఉందని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీశ్ కుమార్ అన్నా రు. బుధవారం ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాహితీ ఫౌండేషన్ ఎన్‌జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన, వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ప్రజల్లో కేన్సర్‌పై అవగాహన పెంచడం అత్యంత అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిషోర్, సాహితీ ఫౌండేషన్ ప్రతినిధులు రాముల కుమార్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
స్టాపర్లు.. ప్రమాదాలకు నిలయాలు
కొత్తపల్లి: కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై కొత్తపల్లి వైద్య కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు స్టాపర్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. వెద్య కళాశాల యాజమాన్యం రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసింది. అడ్డంగా ఉన్న స్టాపర్లు వేగంగా వస్తున్న వాహనాల తాకిడికి నిలువుగా తిరుగుతున్నాయి. వాహనాలు స్టాఫర్లను ఢీకొడుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. పలువురు వాహనదారులు గాయాల పాలయ్యారు. స్టాపర్లు కదలకుండా ఏర్పాటు చేస్తున్న బండరాళ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కృత్రిమ మేధా అవసరం ఎంతో ఉంది
కృత్రిమ మేధా అవసరం ఎంతో ఉంది


